Bigg Boss Telugu 7: 7వ ఎలిమినేషన్ లీక్.. అనుకున్నదే జరిగిందిగా.. బిగ్ బాస్ హిస్టరీలో చెత్త రికార్డు

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చి.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ షోగా మారిపోయింది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో ప్రసారం అవుతోన్నా.. సరికొత్త టాస్కులు, రక్తి కట్టించే గొడవలు, ఊహించని సంఘటనలు, ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఇది జనరంజకంగా సాగిపోతోంది. ఈ క్రమంలోనే ఏడో సీజన్‌లో చాలానే ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ ఏడో ఎలిమినేషన్ వివరాలు లీక్ అయ్యాయి. అవి మీకోసమే!

ఉల్టా పుల్టా అని పేరు ఎందుకు పెట్టారో కాని బిగ్ బాస్ ఏడో సీజన్ నిజంగానే ఎవరూ ఊహించని సంఘటనలో సాగిపోతోంది. ముఖ్యంగా ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, షాక్‌లు కనిపిస్తున్నాయి. దీంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. ఫలితంగా ఏడో సీజన్ జనరంజకంగా సాగుతూ భారీ టీఆర్పీ రేటింగ్ రాబడుతోంది.

Pooja Murthy Eliminated From Bigg Boss Telugu 7 Show in 7th Week

మరీ ముఖ్యంగా ఏడో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా మారుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో జరిగిన అన్ని ఎలిమినేషన్లలోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. అసలే బిగ్ బాస్ షోలో లేడీ విన్నర్లు లేరని అనుకుంటుంటే.. ఇప్పుడు వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం అందరినీ నిరుత్సాహానికి గురి చేస్తోంది.

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో ఈ సీజన్‌లో ఎప్పుడూ లేని విధంగా మేల్ కంటెస్టెంట్లు ఎక్కువ నామినేట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం భోలే షావలి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజలు ఉన్నారు. దీంతో ఈ సారైనా మేల్ కంటెస్టెంటే ఇంటి నుంచి బయటకు వెళ్తాడేమో అని అందరూ అనుకున్నారు.

నామినేషన్స్ తర్వాత మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నా.. ఆ తర్వాత ఓటింగ్‌లో భోలే షావలితో సహా అందరికీ మంచిగా ఓటింగ్ నమోదు అయినట్లు సమాచారం లీకైంది. దీంతో అశ్విని శ్రీ, పూజా మూర్తిలు చివరి స్థానాల్లో ఉన్నారని తెలిసింది. దీంతో వీళ్లిద్దరిలోనే ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉందని కూడా టాక్ వినిపించింది.

Pooja Murthy Eliminated From Bigg Boss Telugu 7 Show in 7th Week

బిగ్ బాస్ ఏడో సీజన్ తాజా వారానికి సంబంధించిన ఎలిమినేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సారి ప్రముఖ సీరియల్ హీరోయిన్ పూజా మూర్తి షో నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. దసరా స్పెషల్‌గా ప్రసారం కాబోతున్న ఆదివారం ఎపిసోడ్‌లో ఆమె ఎలిమినేషన్‌ను ప్రసారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ తెలుగులో ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌లో మాత్రమే వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇండియాలోని ఏ భాషలో చూసుకున్నా కంటిన్యూగా ఇంత మెజారిటీ సంఖ్యలో ఫీమేల్ కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్ జరగలేదు. దీంతో తెలుగు బిగ్ బాస్ షోలో చెత్త రికార్డు నమోదు అయినట్లు అయింది. దీనిపై షోను అభిమానించే వాళ్లంతా పెదవి విరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X