కౌశల్ ఆర్మీ ఇలాంటిదని తెలియదు: పూజా రామచంద్రన్ హాట్ కామెంట్స్!
Recommended Video

బిగ్‌బాస్ షో నుండి గత వారం ఎలిమినేట్ అయిన పూజా రామచంద్రన్ మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయారు. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత తనలో ఎలాంటి మార్పు లేదని, తాను 6వ వారంలో ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరయ్యాను, అందువల్ల ఇపుడు బయటకు రావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడలేదని తెలిపారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు బెస్ట్ మూమెంట్స్ అంటే కమల్ హాసన్ సర్ రావడమే. ఆయన మా దగ్గర కూర్చుని మాట్లాడటం మాలో మరింత ఉత్సాహం నింపింది. పైగా ఆయన చెన్నైకి చెందిన వారు కావడంతో మా ఊరు నుండి ఆత్మీయుడు వచ్చిన ఫీలింగ్ కలిగింది, ఆ సమయంలో నేను కెప్టెన్‌గా ఉండటం మరింత స్పెషల్ అనిపించిందన్నారు.

తాప్సీ అక్కడే ఉంటే బావుండనిపించింది
హీరోయిన్ తాప్సీ నాకు మంచి ఫ్రెండ్. ఆమె వచ్చినపుడు నాతో పాటు ఇంట్లోనే ఉండిపోతే బావుండు అనిపించింది. ఇతర స్టార్స్ వచ్చిన సమయంలో కూడా ఇంట్లో వారంతా చాలా హ్యాపీగా గడిపేవారు అని పూజా తెలిపారు.

కొందరు యాక్ట్ చేస్తుంది నిజమే
ఇంట్లో కొందరు సభ్యులు యాక్ట్ చేస్తున్న మాట నిజమే... అయితే వారికి ఎదురైన సిచ్యువేషన్స్ బట్టి వారు అలా ప్రర్తిస్తుంటారు. ఇక్కడ షో మొత్తాన్ని బిగ్‌బాస్ నడిపిస్తాడు. ఒకసారి ఒకరిపై ఒకరికి కోపం, మరొకసారి ప్రేమ, ఇలా రకరకాల ఎమోషన్స్ కలిగేలా టాస్కులు ఇస్తూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు అని పూజా తెలిపారు.

ఫిజికల్‌గా అందుకే అంత స్ట్రాంగ్
మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్. నేను చిన్నప్పటి నుండి ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండే పనులు చేసేదాన్ని. మా ఇంట్లో ఆడపిల్లలు ఇది చేయకూడదు, మగ పిల్లలు ఇది చేయాలి అని ఏమీ పెంచలేదు. ఈక్వాలిటీతో పెంచారు. అందుకే ఫిజికల్‌గా, మెంటల్‌గా అంత స్ట్రాంగ్... బాయ్స్‌తో పోటీపడి టాస్కులు చేయగలిగాను అని పూజా రామచంద్రన్ తెలిపారు.

శ్యామల అస్సలు నచ్చదు
తేజు వెళ్లి తర్వాత నేను ఎంటరయ్యాను. అందుకే ఆమె లేని లోటు తెలియలేదు. దీప్తి సునైన వెల్లిన తర్వాత కూడా మామూలుగానే అనిపించింది. దీప్తి నల్లమోతు నేను ఇంట్లో ఎంటరవ్వగానే బాగా కనెక్ట్ అయింది. అయితే ఆమె చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. చాలా రిజర్వగా ఉంటుంది. ఇంట్లో చాలా ఇష్టమైన వ్యక్తులు దీప్తి, సామ్రాట్... నచ్చి వ్యక్తి శ్యామల అని పూజా తెలిపారు.

కౌశల్ ఆర్మీ గురించి
నాకు బిగ్ బాస్‌లోకి ఎంటరయ్యే మూడు రోజుల ముందే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అపుడు కౌశల్ ఆర్మీ యాష్‌ట్యాగ్ ఉందని తెలుసు. కానీ ఇంత పెద్ద ఆర్మీ, అభిమానులు ఉన్నారని బయటకు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు.

కౌశల్‌తో గొడవ పడితే
ఇంట్లో కౌశల్‌తో గొడవ పడితే ఎలిమినేట్ అవుతారనే ప్రచారం నిజం కాదు అని నా అభిప్రాయం. ఇంట్లో తనీష్ ప్రతి వారం గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక్కడ కేవలం ప్రేక్షకుల ఓట్లను బట్టే ఎలిమినేషన్స్ జరుగుతాయి అని పూజా తెలిపారు.

ఇంట్లో ఎవరు ఎలాంటి వారు?
మస్ట్ యాక్టివ్ పర్సీన్ కౌశల్, షో బిజ్ టైప్ క్యారెక్టర్ నూనత్ నాయుడు, డెడికేటెడ్‌గా ఆడుతున్నది దీప్తి నల్లమోతు, డ్రామా క్వీన్ దీప్తి సునైన, డ్రామా కింగ్ తనీష్. తనీష్ రొమాంటిక్ అయినా యాంగ్రీ అయినా అందులో ఎంతో కొంత డ్రామా ఉందనిపిస్తుంది అని పూజా అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











