Don't Miss!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బిగ్ బాస్2: హౌస్‌ని అల్లాడిస్తున్న పూజ, ఆ కోపం ఏంటి .. అందరి చూపు వాళ్ళిద్దరిపైనే!
Recommended Video
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 వినోదాత్మకంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులంతా ఆడియన్స్ ఆకట్టుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన పూజ కూడా అల్లాడిస్తోంది. ఇక కౌశల్, గీత ఆకట్టుకునే విధంగా దూసుకుపోతున్నారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదుల చేశారు.
అంతిమ యుద్ధం
తాజగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం హౌస్ లో అంతిమ యుద్ధం అనే టాస్క్ జరగబోతోంది. అది కూడా మహిళలు, పురుషుల మధ్య కావడం విశేషం. ఈ టాస్క్ లో పైచేయి సాధించడం కోసం ఇంటి సభ్యులంతా ఉరుకులు పరుగుల మీద ఉన్నారు.
ఇరగదీస్తున్నారు
పెర్ఫామెన్స్ లో కాస్త వీక్ గా కనిపించిన నందిని గతవారం ఎలిమినేట్ అయింది. ఇప్పుడు హౌస్ లో ఉన్న సభ్యులంతా పెర్ఫామెన్స్ ఇరగదీసేవాళ్ళే. కొన్ని రోజుల క్రితం హౌస్ లోకి వచ్చిన పూజ కూడా అపుడే కెప్టెన్ అయిపోయింది. పూజ ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
లెక్క చేయకుండా
గత కొన్ని రోజులుగా జరుగుతున్న టాస్క్ లని గమనిస్తే ఇంటి సభ్యులు గాయాలని సైతం లెక్కచేయడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నేడు ప్రసారం కాబోయే అంతిమ యుద్ధం టాస్క్ లో కూడా డే రిపీట్ కాబోతోంది.
చేయి ఇరుక్కుపోయినా
టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ తెగ బిజీగా కనిపిస్తున్నారు. తలుపు మధ్యలో గీత మాధురి చేయి ఇరుక్కుపోయింది. అరుస్తుందే కానీ తీయడానికి మాత్రం ప్రయత్నించడం లేదు.
పూజ కోపం
హౌస్ కెప్టెన్ పూజ రామచంద్రన్ రోజులు గడిచే కొద్ది హాట్ టాపిక్ గా మారుతోంది. ఏ మాత్రం బెణుకు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో పూజ కోపం కట్టలు తెంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. శ్యామల, కౌశల్ పై పూజ ఆ రేంజ్ లో ఎందుకు ఫైర్ అయిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
వాళ్ళిద్దరిపైనే
ఇక ఆడియన్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్న ఇంటి సభ్యులు కౌశల్, గీత మాధురి. కౌశల్ కు ధీటుగా గీత మాధురి కూడా పెర్ఫామ్ చేస్తోంది. టైటిల్ బరిలో వీళ్ళిద్దరూ ఫేవరెట్స్ గా ఉన్నట్లు ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.