వైరల్ పిక్ : బీచ్‌లో హీటెక్కించే భంగిమ.. భర్తతో కలిసి బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్
పూజా రామచంద్రన్.. వెండితెరపై అడపాదడపా క్యారెక్టర్స్‌తో ఓ మోస్తరుగా పాపులార్టీని సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సినిమాలతో ఫేమస్ అయింది చాలా తక్కువే కానీ బిగ్‌బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో మగవారి ధీటుగా పార్టిసిపేట్ చేయడం, నిజాయితీగా ఉండటం, ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడంతో మంచి పేరు తెచ్చుకుంది.

బిగ్‌బాస్ షోతో పాపులర్..
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో భాను, తేజస్వీ, దీప్తి సునయన, యాంకర్ దీప్తి, గీతా మాధురి, శ్యామల వంటి వారెందరో ఉన్నా గానీ టాస్కుల్లో అంతగా ఎనర్జీనే చూపించేవారు కాదు. అయితే పూజా రామచంద్రన్ వచ్చిన తరువాత లేడీ గ్యాంగ్‌కు బలం పెరిగినట్టైంది. టాస్కుల్లోనైనా, వాదించడంలోనైనా పూజా ముందుండేది.

అంతంత మాత్రంగానే ఆఫర్స్..
అయిత వైల్డ్ కార్డ్ కాబట్టి.. హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. రెండు మూడు వారాలు మాత్రమే ప్రేక్షకులు ఆమెను భరించారు. ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చిన పూజాకు ఆఫర్స్ అంతంతమాత్రమే వచ్చాయి. రెండు మూడు చిన్న సినిమాల్లో నటించినా.. అవి అంతగా పేరు తీసుకురాలేకపోయాయి.

సోషల్ మీడియాలో హల్చల్..
సోషల్ మీడియాలో పూజా రామచంద్రన్ పేరు మార్మొగిపోతూ ఉంటుంది. భర్త జాన్‌తో కలిసి బీచ్‌లంటూ తిరుగుతూ ఉంటుంది. భర్తతో బికినీ ఫోటోలకు పోజులిచ్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. పూజా బికినీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.
Recommended Video

తాజాగా మరో భంగిమ..
వివిధ భంగిమల్లో బికినీ అందాలను కనువిందు చేస్తూ ఉంటుంది పూజా. తాజాగా మరో పిక్ పోస్ట్ చేస్తూ.. నీ కోసం నువ్ జాగ్రత్తలు తీసుకోవడంలోనే నీపై నీకెంత ప్రేముందో తెలుస్తుంది.. ఏ ఇద్దరూ కూడా ఒకే ధోరణిలో ఆలోచించరు, అనుభూతి చెందరు కానీ మేము మాత్రం ఇద్దరం ఒకేలా ఉంటాము.. ఇకపై నుంచైనా మన స్టైల్లో మనం బతకడం నేర్చుకుందామంటూ తల కిందులుగా ఉన్న బికినీ పిక్‌ను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











