బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌గా క్రేజీ హీరోయిన్ .. భారీ మొత్తానికి కుదిరిన డీల్!

By Manoj

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ... తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకున్న షో 'బిగ్ బాస్'. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమైన దీనికి తక్కువ వ్యవధిలోనే ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. సరికొత్త థీమ్‌తో నడిచే షో అయినప్పటికీ... ఇక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే నాలుగో సీజన్‌తో రాబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి 'యన్‌టిఆర్' కుమార్తె ఎంట్రీ ఇవ్వబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

Recommended Video

Bigg Boss 4 Telugu Official Announcement,Contestants List Goes Viral || Oneindia Telugu
అనుమానాలు పటాపంచలు చేసిన తారక్

అనుమానాలు పటాపంచలు చేసిన తారక్

ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షో. అప్పటి వరకు సినిమా హీరోగా పరిచయం ఉన్న జూనియర్ ఎన్టీఆర్... ఈ షోను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. దీంతో అనతి కాలంలోనే అత్యధిక రేటింగ్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసిందీ షో. విజయవంతమైన మొదటి సీజన్‌లో శివ బాలాజీ ట్రోఫీని గెలుచుకున్నాడు.

నేచురల్‌గానే వచ్చినా.. నయా ట్రెండ్ సెట్

నేచురల్‌గానే వచ్చినా.. నయా ట్రెండ్ సెట్

మొదటి సీజన్ విజయవంతం అవడంతో రెండో దానిపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో సీజన్‌ 2ను హోస్ట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ఎంత సహజసిద్ధంగా యాక్టింగ్ చేస్తాడో.. అదే స్థాయిలో హోస్టింగ్ చేసి సరికొత్త వన్నె తెచ్చాడీ స్టార్ హీరో. దీంతో ఈ సీజన్ కూడా సక్సెస్ అయింది. ఇందులో యాక్టర్ కౌశల్ మందా విజేతగా నిలిచాడు.

కుర్ర హీరోలకు పోటీ... రికార్డులు బద్దలు

కుర్ర హీరోలకు పోటీ... రికార్డులు బద్దలు

రెండో సీజన్‌లో జరిగిన గొడవల కారణంగా బిగ్ బాస్ మూడో సీజన్‌ విషయంలో ఎన్నో వివాదాలు చెలరేగాయి. అంతలోనే కాస్టింగ్ కౌచ్ కూడా తెరపైకి వచ్చింది. దీంతో షోను బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపించింది. ఇలాంటి సమయంలో కింగ్ నాగార్జున ఈ సీజన్ బాధ్యతలు తీసుకొని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ ట్రోఫీని రాహుల్ సిప్లీగంజ్ అందుకున్నాడు.

నాలుగో సీజన్‌పై మొదలైన గాసిప్పులు

నాలుగో సీజన్‌పై మొదలైన గాసిప్పులు

ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... నాలుగో దానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే దీనికి పని చేసే హోస్ట్... పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సీజన్ 4 ట్రెండ్ అవుతోంది.

బిగ్ బాస్ 4పై అధికారిక ప్రకటన.. టీజర్

బిగ్ బాస్ 4పై అధికారిక ప్రకటన.. టీజర్

బిగ్ బాస్ సీజన్ 4 గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్న సమయంలో స్టార్ మా దీనికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుందని ఇటీవల ఓ టీజర్ ద్వారా తెలిపింది. అయితే, ఇది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది... ఇందులో ఎంత మంది కంటెస్టెంట్లు ఉంటారు.. ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేదు.

బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ‘యన్‌టిఆర్’ కుమార్తె

బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ‘యన్‌టిఆర్’ కుమార్తె


ఆగస్టు రెండు లేదా మూడో వారంలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. హీరోయిన్ పూనమ్ బజ్వా ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందట. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె.. ఇటీవల ‘యన్‌టిఆర్' బయోపిక్‌లో ఆయన కుమార్తె లోకేశ్వరిగా కనిపించి మెప్పించింది.

వివరాలు.. భారీ మొత్తానికి కుదిరిన ఢీల్.!

వివరాలు.. భారీ మొత్తానికి కుదిరిన ఢీల్.!

‘మొదటి సినిమా' అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది పూనమ్ బజ్వా. దీని తర్వాత నాగార్జున సరసన ‘బాస్'లో నటించింది. అనంతరం ‘పరుగు', ‘వేడుక' తదితర సినిమాలు చేసింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ‘యన్‌.టి.ఆర్' బయోపిక్‌లో కనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రాబోతుంది. ఇందుకోసం భారీ మొత్తం అందుకోబోతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X