హైపర్ ఆదికి మరీ అంతా కక్కుర్తా.. లేడీ డ్యాన్సర్ల వైపు అలా చూస్తాడట.. పరువుదీసిన పూర్ణ

బుల్లితెరపై ఢీ షోది ఒక చరిత్ర. ఢీ వేదికపై నుంచి ఎంతో మంది గొప్ప డ్యాన్సర్లు వెలుగులోకి వచ్చారు. అలా వచ్చిన వారే ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. బాబా భాస్కర్, రఘు, జానీ, శేఖర్ మాస్టర్ ఇలా ఎంతో మంది గొప్ప డ్యాన్సర్లు అక్కడి నుంచే వచ్చారు. ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అంతుకు మించి అంటూ జబర్దస్త్ షోలాగా మార్చేశారు. డ్యాన్సులు తక్కువై కామెడీ స్కిట్స్ ఎక్కువయ్యాయి.

 అందరూ కలిసి రచ్చ రచ్చ..

అందరూ కలిసి రచ్చ రచ్చ..

ఢీ షోలో ప్రదీప్, సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్షిణి ఇలా అందరూ కలిసి నానా రచ్చ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి జంటలు మాత్రం వేరే లెవెల్‌లో హంగామా చేస్తుంటాయి. వీరికి తోడు జడ్జ్‌లు కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు.

ఆ ముగ్గురు అలా..

ఆ ముగ్గురు అలా..

శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణలు చేసే అల్లరి ఇంకో రకంగా ఉంటుంది. శేఖర్ మాస్టర్ కలిపే పులిహోర తెగ వైరల్ అవుతుంది. జడ్జ్‌లతోనే కాకుండా వర్షిణి, రష్మీలతోనూ మధ్య మధ్యలో ఘాటు రొమాన్స్ చేస్తుంటాడు. వీరిలో శేఖర్ మాస్టర్ ఎప్పుడో కలిసిపోయాడు.

ప్రదీప్ పూర్ణ రొమాన్స్..

ప్రదీప్ పూర్ణ రొమాన్స్..

ఇక ఢీ షోలో ఖాళీగా ఉన్నది ప్రదీప్ ఒక్కడే కావడంతో పూర్ణతో లింక్ పెట్టేశారు. దానికి తోడు పూర్ణ కూడా ప్రదీప్ అంటే క్రష్ అని చెప్పేసింది. అంతటితో ఆగకుండా ఓ స్కిట్‌లో ప్రదీప్‌కు భార్యగా జీవించేసింది. ఇక నటిగా పూర్ణ ఎంతగా నిరూపించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందరిలా ఇమిటేషన్..

అందరిలా ఇమిటేషన్..

పూర్ణ గతంలో శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, ప్రియమణి ఎలా ఉంటారు?జడ్జ్‌మెంట్ ఎలా ఇస్తారో చేసి చూపించింది. అందులో శేఖర్ మాస్టర్‌ను అయితే అచ్చుగుద్దినట్టు దింపేసింది. అలా పూర్ణలోని ఓ టాలెంట్ బయటకు వచ్చింది. పక్కనున్న పరిస్థితులు, మనుషులను ఎంత గమనిస్తుందో తెలిసిపోయింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
హైపర్ ఆదిలా..

హైపర్ ఆదిలా..

పూర్ణ ఈ సారి హైపర్ ఆదిలా నటించింది. మరీ ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తే ఎలా తీక్షణంగా చూస్తాడు.. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో చేసి చూపించింది. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. పూర్ణ అలా నటిస్తుంటే ఆది కూడా తెగ నవ్వేశాడు. పూర్ణ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే హైపర్ ఆదికి అంత కక్కుర్తి ఉందా? అనే అనుమానం వచ్చేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X