ఝాన్సీ విడాకుల విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ...
హైదరాబాద్ : పదిహేనేళ్ళ ఏళ్ల క్రితం ఝాన్సీతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు పదేళ్ల పాపకూడా వుంది. ఆనందంగా జీవితం సాగుతున్న సమయంలో మా ఇద్దరి మధ్య చిన్న సమస్య తలెత్తింది. పరిష్కరించుకుని కలిసుందామని ఏడేళ్లుగా ఝాన్సీ కోసం ఎదురు చూశాను. ఆమె విడాకులు కావాలంది. మేలో విడాకులు తీసుకున్నాం. పాప ప్రస్తుతం ఝాన్సీ దగ్గరే వుంది. పాప నన్ను కలిసే విధంగా కోర్టువారు వెసులు బాటు కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను అన్నారు జోగీనాయుడు. ఈ విషయం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియపరిచారు.
జోగినాయుడు మాట్లాడుతూ .... ''ఈవీవీగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొని పరిశ్రమకి వచ్చా. 'అల్లుడా మజాకా'కి మూడు రోజులు పనిచేశాక ఎక్కువమంది అయ్యారని తీసేశారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దగ్గర పనిచేశా. బుల్లితెరతో గుర్తింపు సాధించాక సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. జోగిబ్రదర్స్‌గా కృష్ణంరాజుతో కలిసి ఎక్కువగా నవ్వించే పాత్రలే పోషించా.''ని తెలిపారు.

అలాగే '' నటుడిగా కొనసాగుతూనే ఎల్.జె.స్టూడియోని స్థాపించి అందులో మూడొందల చిత్రాలకి నిర్మాణానంతర కార్యక్రమాలను చేశా. నష్టాలు రావడంతో ఆ స్టూడియోని అమ్మేశా. దర్శకత్వం చేయాలన్న నా కల మాత్రం అలాగే ఉండిపోయింది. త్వరలోనే అది నెరవేరుతుందని నమ్ముతున్నా. ఈ యేడాది చివర్లో నా మిత్రులతో కలిసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాను. దర్శకుడిని కావాలని పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కానీ నటుడిగా గుర్తింపు సంపాదించా. 'స్వామి రా రా' తర్వాత ప్రాధాన్యమున్న పాత్రలు దక్కుతున్నాయి'' అంటున్నారు జోగినాయుడు.
తొలుత బుల్లితెర ద్వారా గుర్తింపు సంపాదించిన ఆయన 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వందకిపైగా సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











