బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ కమెడియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ: వారం నుంచి ఆ గదికే పరిమితం!
సరికొత్త థీమ్‌తో వచ్చినప్పటికీ... తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించింది బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. అదే సమయంలో కొన్ని కోట్ల మందిని తన వైపునకు తిప్పుకుంది. దీంతో బిగ్ బాస్ షో పట్ల ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగూ వచ్చింది. ఈ కారణంగానే తెలుగులో ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది.
ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన నాలుగో సీజన్ మాత్రం చప్పగా సాగుతుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు బిగ్ బాస్ యూనిట్ వారం రోజులకే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో జబర్ధస్త్ కమెడియన్‌ను కంటెస్టెంట్‌గా తీసుకొస్తోంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఏకంగా పదహారు మందిని పంపేశారు
అక్కినేని నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కింగ్ గత ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ కోసం ఏకంగా పదహారు మంది ప్రముఖులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. వీరిలో ఎక్కువ శాతం మంది సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారే ఉన్నారు. ఈ జాబితాలో వృద్ధురాలైన గంగవ్వ కూడా ఉండడం విశేషం.

నామినేషన్.. సీక్రెట్ రూమ్... కట్టప్ప
ఎంతో సందడిగా ప్రారంభమైన బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇందులోనే నామినేషన్ ప్రక్రియతో పాటు కొన్ని టాస్క్‌లు జరిగాయి. అలాగే, సీక్రెట్ రూమ్‌లో ఉంచిన ఇద్దరిని హౌస్‌లోకి పంపించారు. ఇక, ‘మీలో ఒక కట్టప్ప ఉన్నాడు' అంటూ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు బిగ్ బాస్. ఇలా షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

చప్పగా సాగుతోన్న షో.. విమర్శలు
గత మూడు సీజన్లతో పోల్చుకుంటే... బిగ్ బాస్ షో సక్సెస్ అవడానికి ఈ సారి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ, ఎందుకనో ఈ షో చప్పగా సాగుతోంది. హౌస్‌లోకి పంపించిన కంటెస్టెంట్ల కారణంగానో... ఇచ్చే టాస్కుల కారణంగానో తెలియదు కానీ... షోపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో షో నిర్వహకులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

వారం రోజులకే వైల్ కార్డ్ ఎంట్రీ ప్లాన్
బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ అనుకున్న విధంగా సాగకపోవడంతో షో నిర్వహకులు సరికొత్త ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం కోసం వారం రోజులకే వైల్డ్ కార్డ్ ఎంట్రీని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యే కంటెస్టెంట్ ఎవరన్న దానిపై బయట బాగా చర్చలు జరుగుతున్నాయి.
Recommended Video

జబర్ధస్త్ కమెడియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
తాజా సమాచారం ప్రకారం... జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇందుకోసం అతడు ఇప్పటికే షో నిర్వహకులు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నాడని అంటున్నారు. ఇది ముగిసే వరకు సీక్రెట్ రూమ్‌లో ఉంచి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











