Bigg Boss Telugu 7 షోలోకి గ్లామరస్ న్యూస్ ప్రజెంటర్.. అందాల యాంకరమ్మపై కన్నేసిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నది. అనేక రూమర్లకు తెర దించుతూ హోస్ట్‌గా కింగ్ నాగార్జున మళ్లీ తెరపైకి వచ్చాడు. హోస్ట్‌గా మరోసారి రంగ ప్రవేశం చేసిన వెంటనే ఏడో సీజన్ ఉల్టా పల్టా అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

దాంతో ఈ సారి బిగ్‌బాస్ తెలుగు 7 సరికొత్తగా ఉండబోతుందనే విషయం స్పష్టమైంది. దాంతో ఈ షోపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ షోలోకి పాపులర్ న్యూస్ యాంకర్ అడుగుపెడుతున్నదనే విషయం క్రేజీగా మారింది. ఇంతకు ఆ న్యూస్ యాంకర్ ఎవరనే వివరాల్లోకి వెళితే..

Popular News Anchor Pratyusha Penmetsa into Bigg Boss Telugu 7

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌కు అన్నీ హంగులు పూర్తయ్యాయి. దాదాపు కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయిందనేది ఎండెమాల్ షైన్ నిర్వాహకులు వెల్లడించిన సమాచారం. అయితే చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చని కూడా చెబుతున్నారు. దాంతో ఈ సారి కూడా క్రేజీ కంటెస్టెంట్లతో ఊహించని విధంగా కంటెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ఆగస్టు 31 తేదీ నుంచి అధికారికంగా మొదలు కాబోతున్నది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను గురువారం నుంచి క్వారంటైన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో రెండు రోజులపాటు కంటెస్టెంట్లను ఉంచుతారు. సెప్టెంబర్ 1వ తేదీన ఓపెనింగ్ డే సెలబ్రేషన్స్ కోసం, కంటెస్టెంట్ల పరిచయం కోసం షూట్‌ను మొదలుపెడుతారు.

Popular News Anchor Pratyusha Penmetsa into Bigg Boss Telugu 7

అయితే ప్రతిసారి మాదిరిగానే ఈ సారి కూడా 15 మంది వరకు కంటెస్టెంట్లు ఉండబోతున్నట్టు సమాచారం. ఇందు కోసం యంగ్ హీరో, హీరోయిన్లు, కమెడియన్లు, యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్స్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ప్రచారంలో ఉన్న పేర్లలో న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా ఉన్నట్టు సమాచారం.

గత సీజన్‌లో కూడా న్యూస్ యాంకర్ ప్రత్యూష పేరు బలంగా వినిపించింది. అయితే ఆమె పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె షోలో వెళ్లడానికి నిరాకరించారని సన్నిహితులు తెలిపారు. అయితే ఈ సారి ప్రత్యూష ఒప్పుకోవడంతో ఆమె ఎంట్రీ గ్రాండ్‌గా ఇవ్వడానికి సిద్దమైనట్టు సమాచారం.

న్యూస్ యాంకర్ ప్రత్యూష వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే.. ప్రత్యూష అసలు పేరు ప్రత్యూష పెన్మత్స. విశాఖపట్నంకు చెందిన ప్రత్యూష చాలా కాలంగా టీవీ9లో పనిచేస్తున్నారు. తెలుగులో టాప్ అండ్ టాలెంటెడ్ న్యూస్ ప్రజెంటర్‌గా మంచి పేరు ఉంది. బిగ్‌బాస్‌లోకి ప్రత్యూష అడుగుపెడితే.. తనదైన మాటలు, శైలితో దుమ్మురేపడం ఖాయం అని స్నేహితులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X