బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై అత్యాచారయత్నం.. స్నేహితుడే కీచకుడిగా మారి..
బిగ్‌బాస్ కంటెస్టెంట్, ప్రముఖ గాయని తన స్నేహితుడి కారణంగా వేధింపులకు గురైంది. స్నేహితుడి వేధింపులు తట్టుకోలేకపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తనను నోయిడా సెక్టార్ 18 హోటల్‌లోని ఎలివేటర్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించి లైంగికదాడికి ప్రయత్నించారు అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ సెలబ్రెటీ పేరును పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
పోలీసులు తెలిపిన ప్రకారం.. బిగ్‌బాస్‌లో పాల్గొన ప్రముఖ గాయని షూటింగు కోసం నోయిడా వచ్చారు. ఆమె ప్రస్తుతం ఓ హోటల్‌లో బస చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె తన హోటల్ గదికి వెళ్తుండగా ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. ఎలివేటర్ ప్రాంతంలో తనను బంధించేందుకు ప్రయత్నించారు. తన చేతులు పట్టుకొని అత్యాచారప్రయత్నం చేశారని బిగ్‌బాస్ సెలబ్రిటీ ఫిర్యాదు చేసింది అని తెలిపారు.

తనపై తన స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే హోటల్ సిబ్బందికి, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసి అప్రమత్తమైనట్టు సమాచారం. నిందితుడు బెయిల్‌పై విడుదల కాగా.. ఆమె రక్షణను కోరడంతో పోలీసులు ప్రొటెక్షన్ కలిపించారు.
బాధితురాలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కోరిక మేరకు ఆమె పేరును బయటకు రాకుండా పోలీసుల జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆమె పేరును బయటకు రాకుండా.. మీడియాలో వెల్లడించకుండా స్థానిక రిపోర్టులకు సూచనలు చేశారు. దాంతో ఆమె పేరును సీకెట్ర్‌గా ఉంచడం జరిగింది.


Click it and Unblock the Notifications











