Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ షోపై రివ్యూలతో పాపులర్.. ఇప్పుడు అదే హౌజ్‌లోకి చిత్తూరు చిరుత
సరికొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ముందుగు సాగుతోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. ఇంతకుముందు ఎప్పుడూ చూడని కాన్సెప్ట్‌తో అంచనాలకు మించి బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. అంతేకాకుండా ఇందులో పాల్గోన్న సభ్యులకు సినీ అవకాశాలు కల్పించే చక్కని వేదికగా కూడా మారింది బిగ్‌బాస్ రియాలిటీ షో. అలాగే ఈ షోపై, పాల్గొన్న కంటెస్టెంట్లపై ఎంతోమంది రివ్యూలు చేశారు. కానీ, అందులో ఎక్కువగా మోస్ట్ పాపులర్ అయింది గలాటా గీతూ రాయల్. ఏ బిగ్‌బాస్ షోకి రివ్యూలూ రాసి పేరు తెచ్చుకుందో అదే హౌజ్‌లోకి అడుగు పెట్టిన ఈ చిత్తూరు అమ్మాయి గురించి తెలుసుకుందామా!

చిత్తూరు యాసకు ఫిదా..
ఏ బిగ్‌బాస్ షోకు రివ్యూలు చేసిందో అదే బిగ్‌బాస్ హౌజ్‌లో కాలు మోపనుంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గీతూ రాయల్. గలాటా గీతూ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్‌బాస్ షోపై రివ్యూ వీడియో చేసి మోస్ట్ పాపులర్ అయింది గీతు రాయల్. ఆమె మాట్లాడే చిత్తూరు స్లాంగ్‌కు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. ఇక ఈ మధ్యనే ఈటీవీ జబర్దస్త్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.

నాలుగేళ్ల వయసులో..
ఇక గీతూ రాయల్ పర్సనల్ లైఫ్‌లోకి వస్తే.. చిత్తూరులో ఆగస్టు 27, 1997లో పుట్టింది గీతూ రాయల్. ఆమె తండ్రి శేఖర్ కోవూరి కాగా తల్లి సుధారాజ్యం. గీతుకు ఒక సోదరుడు హర్ష తేజ ఉన్నాడు. గీతు నాలుగేళ్ల వయసులో తన తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చేసరికి ఆమె తల్లి ఉద్యోగం చేయాల్సి వచ్చింది.

టిక్‌టాక్ వీడియోలతో..
దీంతో ఆమె కుటుంబం నంద్యాలకు మారాల్సి వచ్చింది. నంద్యాలలోని నారాయణ జూనియర్ కాలేజ్ ఇంటర్ చేసి బెంగళూర్‌కు వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది గీతూ రాయల్. చదువు పూర్తయిన తర్వాత కొన్నేళ్లు అమెజాన్‌లో పని చేసింది. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ టిక్‌టాక్‌లో వీడియోలు చేసింది. అందులో మోటివేషనల్ డైలాగ్స్ చెబుతూ చాలా పాపులర్ అయింది.

ఒక్క రోజులో 50 వేల మంది ఫాలోవర్స్..
తన చిత్తూరు యాసలో చేసిన ఓ మోటివేషన్ కొటేషనల్ వీడియోతో ఒక్క రోజులో 50, 000 మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది గీతు. అలా కేవలం నెల వ్యవధిలో సుమారు 5 లక్షల 50 వేల ఫాలోవర్లను కలిగింది. తర్వాత టిక్‌టాక్ నిషేధంతో ఇన్‌స్టాలో వీడియోస్ చేయడం, అవి నెటిజన్లకు బాగా నచ్చడంతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఆర్జేగా అవకాశం..
మోటివేషనల్ వీడియోస్‌తోపాటు గలాటా గీతూ రాయల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా బిగ్‌బాస్‌పై రివ్యూలు చేయడం ప్రారంభించింది. తర్వాత గీతూకు 2018లో హైదరాబాద్ రేడియో సిటీలో ఆర్జేగా అవకాశం వచ్చింది. అక్కడ కూడా బిగ్‌బాస్‌పై సమీక్షలు చేసింది.

ఫైనల్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి..
ఆ తర్వాత జబర్ధస్త్‌లో ఎంట్రీ ఇచ్చింది. రోహిణి టీమ్‌లో గీతూ చేసిన పర్ఫామెన్స్ చూసి అలాగే చేసే అవకాశం వచ్చింది. ఈ ఫేమ్ ప్రస్తుతం బిగ్‌బాస్ 6తెలుగులో అడుగు పెట్టే అవకాశాన్ని తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











