For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బతుకు జట్కా బండి షో గుట్టు విప్పిన పోసాని.. అందుకే మానేశానని వెల్లడి

  |

  సినీ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్టుగా పోసాని కృష్టమురళి ఎన్నో పాత్రలను వినోద రంగంలో పోషించడమే కాకుండా తన యాటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నారు. ముక్కుసూటిగా ఆయన మాట్లాడితే.. ఎవరైనా సరే హడలెత్తాల్సిందే. ఫైర్ బ్రాండ్ యాక్టర్‌గా, ఫిల్మ్ మేకర్‌గా ముఖానికి మాస్క్ వేసుకోకుండా నిజాలు మాట్లాడుతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాదాస్పద బతుకు జట్కా బండి కార్యక్రమంలో జరిగే విషయాలపై స్పందిస్తూ..

  సుమ యాంకరింగ్ అంటే ఇష్టం

  సుమ యాంకరింగ్ అంటే ఇష్టం

  నాకు సినిమా రంగం ఎంత ఇష్టమో.. టెలివిజన్ రంగమన్నా అంతే ఇష్టం. నాకు యాంకర్ సుమ చేసే కార్యక్రమాలను ఇష్టపడుతుంటాను. ఆమె తన షోలకు పిలుస్తే వెళ్తుంటాను. అలాగే జబర్దస్త్ కామెడీ షో చేశాను. అలాగే రోజా హోస్ట్‌గా ఉండే బతుకు జట్కా బండి షోను కూడా చేశాను. ఒక సంవత్సరం కాంట్రాక్టు పూర్తి కావడంతో మానేశాను అని పోసాని కృష్ణ మురళి అన్నారు.

  నవ్వమని.. ఏడ్వమని బలవంతం

  నవ్వమని.. ఏడ్వమని బలవంతం

  బతుకు జట్కా బండి కాంట్రవర్సీలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి కొన్ని విమర్శలు నా వరకు వచ్చాయి. అందులో పాల్గొనే వారిని నవ్వమని, ఏడ్వమని బలవంతం చేస్తారు. వారిని కొడుతారు అనే వివాదాస్పద అంశాలు నేను ఆ షోలో ఉన్నప్పుడు జరగలేదు. నేను ఇలాంటి వాటికి వ్యతిరేకమని ముందే చెప్పాను అని పోసాని చెప్పారు.

  ఆ విషయాలు ముఖం మీదే చెప్పాను

  ఆ విషయాలు ముఖం మీదే చెప్పాను

  బతుకు జట్కా బండి కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ముందే నేను ఏమి ఆశిస్తున్నానో అదే ముఖం మీదే చెప్పాను. స్టేజ్ అంతా నాకు అప్పగించాలని.. మిగితా విషయాలు నేను చూసుకొంటానని చెప్పేశాను. జెన్యూన్ అయితేనే బాధితులకు సపోర్ట్ చేస్తాను. ఫలానా అమ్మాయికి సపోర్ట్ చేయమని అడిగితే నో చెప్పేవాడిని. నేను ఉన్నంత కాలం అలాంటివి జరుగలేదు. ఆ తర్వాత చెప్పలేను అని పోసాని అన్నారు.

  ఎవరిని కొట్టలేదు.. కొట్టించుకోలేదు

  ఎవరిని కొట్టలేదు.. కొట్టించుకోలేదు

  బతుకు జట్కా బండి ప్రొగ్రాంలో కొందరిని సపోర్ట్ చేయమని అడిగితే ఒప్పుకొనే వాడిని కాదు. అలా వాళ్లు ఎక్కువగా నన్ను అడిగే వాళ్లు కూడా కాదు. నేను ఆ షోలో ఉన్నంత కాలం ఎవరిని కొట్టిన దాఖలాలు లేవు. కొట్టించుకొనే సందర్భాలు కూడా లేవు. ఆ షోలో చాలా కుటుంబాలను కలిపాం. దాదాపు 90 శాతం సక్సస్ అయ్యాయి. బయటకు వెళ్లిన తర్వాత ఒకట్రెండు కేసులు ఫెయిల్ అయ్యాయి అని పోసాని తెలిపారు.

  నాకు ట్రస్టులు లేవు.. కానీ సహాయం చేశాను

  నాకు ట్రస్టులు లేవు.. కానీ సహాయం చేశాను

  బతుకు జట్కా బండి షోలో పాల్గొన్న వారి పిల్లలను చదివించేందుకు డబ్బులు సహాయం చేశాను. నా పేరు మీద ట్రస్టులు లేవు. డబ్బులు ఉంటే 15 మందికి గుండె జబ్బుకు చికిత్స చేయించాను. మంచి లక్ష్మీ ఇద్దరు అమ్మాయిలకు లక్ష చొప్పున సహాయం చేశాను. డబ్బులు లేని సమయంలో సహాయం చేయడం కుదరడం లేదు అని పోసాని వెల్లడించారు.

  Sarkaru Vaari Paata : Reason Behind Mahesh Babu Tattoo
  నాకు వెకిలి చేష్టలు రావు

  నాకు వెకిలి చేష్టలు రావు

  జబర్దస్త్ ప్రొగ్రాంలో నటించినందుకు నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను చేసిన స్కిట్‌కు చాలా మంచి రెస్సాన్స్ రావడం, నన్ను అనుకరించడం చూస్తే నాకు సంతోషం కలిగింది. నాకు వెకిలి చేష్టలు రావు. హింసరాజు పులకేశి మాదిరిగా నేను హింసించను. సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని కెలకను.. వారు నన్ను కెలకరు అని పోసాని చెప్పారు.

  English summary
  Fire brand actor, Writer Posani Krishna Murali reveals facts about Bathuku Jataka Bandi show as Roja Host. He squashes rumours around the program. He came out from the show after one year agreement finishes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X