జబర్ధస్త్ ప్రియులకు గుడ్ న్యూస్: రోజా సూచన.. నాగబాబు స్థానం ఆయనదే.!

By Manoj

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో 'జబర్ధస్త్' పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఏడు సంవత్సరాలుగా నాన్ స్టాప్‌గా సాగుతున్న ఈ స్టాండప్ కామెడీ షోకు భారీగా క్రేజ్ ఉంది. దీనికి కారణం ఈ షో నడుస్తున్న తీరే. మొదట్లో వారానికి ఒక్కరోజు మాత్రమే ప్రసారం అయిన జబర్ధస్త్.. కొన్నేళ్లుగా రెండు రోజులు వస్తోంది. దీంతో ఈ షోను చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో 'జబర్దస్త్' నుంచి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోవడం కలకలం రేపింది. తాజాగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరాయన.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది వచ్చారు

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది వచ్చారు

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు పరిచయం అయ్యారు. వీళ్లు కేలవం టీవీ షోలకు మాత్రమే పరిమితం కాలేదు. వీరిలో చాలా మంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీళ్లంతా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. వీరి కారణంగానూ జబర్ధస్త్ బాగా ఫేమస్ అవుతోంది.

రోజాను ఎమ్మెల్యే చేసింది కూడా ఈ షోనే

రోజాను ఎమ్మెల్యే చేసింది కూడా ఈ షోనే

ఈ షో వల్ల కేవలం ఆర్టిస్టులు మాత్రమే కాదు.. జడ్జ్‌లుగా వ్యవహరించిన నాగబాబు, రోజా కూడా లాభం పొందారు. ప్రొడ్యూసర్‌గా భారీ నష్టాలను ఎదుర్కొన్న సమయంలో నాగబాబుకు ఈ షో బాగా ఉపయోగపడిందని ఆయనే చెప్పారు. అలాగే, తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్ధస్త్ షో కూడా కారణమే అని రోజా చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు.

 నాగబాబు వెళ్లిపోవడంతో అనుమానాలు

నాగబాబు వెళ్లిపోవడంతో అనుమానాలు

విజయవంతంగా ప్రసారం అవుతున్న ‘జబర్ధస్త్' నుంచి నాగబాబు వెళ్లిపోవడంతో చాలా అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ షో ఇక ఉంటుందో లేదో అన్న సందేహం కూడా చాలా మందిలో వ్యక్తం అయింది. అలాగే, జబర్ధస్త్‌ను ఇకపై వారంలో ఒకరోజు మాత్రమే ఉంచుతున్నారని కూడా అన్నారు. దీంతో ఈ షో హాట్ టాపిక్ అయిపోయింది.

చాలా మంది సెలెబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి

చాలా మంది సెలెబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి

వ్యక్తిగత కారణాలతో జబర్ధస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడంతో, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ సాగింది. ఆ సమయంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కమెడియన్ అలీతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ పేరు కూడా ఉంది. అలాగే, బండ్ల గణేష్‌ను కూడా అనుకున్నారు. కానీ, వీళ్లెవరూ ఫైనల్ కాలేదు.

జబర్ధస్త్ ప్రియులకు గుడ్ న్యూస్

జబర్ధస్త్ ప్రియులకు గుడ్ న్యూస్

జబర్ధస్త్ షోలో పర్మినెంట్ జడ్జ్‌గా ఎవరు ఉంటారన్న చర్చలకు తాజాగా బయటకు వచ్చిన ఓ వార్తతో పుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు వారాలుగా జడ్జ్‌గా వ్యవహరిస్తున్న పోసాని కృష్ణ మురళినే కొనసాగించబోతున్నారని తెలుస్తోంది. ఆయనను తీసుకోవడానికి కారణం రోజా సూచనలేననే టాక్ కూడా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X