జబర్ధస్త్‌లోకి బాలకృష్ణ.. స్వాగతం పలికిన రోజా: రష్మీతో జన్మ జన్మల బంధం అంటూ!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకుంటూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ప్రసారం అవుతోన్న దీనికి ఒకే తరహా రేటింగ్ వస్తోంది. అందుకే దీనికి పోటీగా ఎన్ని కొత్త షోలు వచ్చినా పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా, వారం వారం సరికొత్త ప్రయోగాలు చేస్తూ షోను మరింత హాస్యభరితంగా మార్చుతున్నారు జబర్ధస్త్ నిర్వహకులు. ఈ నేపథ్యంలో ఈ కామెడీ షోలోకి నందమూరి బాలకృష్ణను తీసుకొచ్చారు. అంతేకాదు, అతడి కోసం రష్మీని రంగంలోకి దించారు. ఆ వివరాలు మీకోసం!

 వందల మందిని పరిచయం చేసింది

వందల మందిని పరిచయం చేసింది

బుల్లితెరపై కొన్నేళ్లుగా మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది జబర్ధస్త్ షో. ఈ క్రమంలోనే టాలెంట్ ఉండి, నిరూపించుకునే ప్లాట్‌ఫాం దొరకని ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చిందీ షో. అంతేకాదు, ఎంతో మంది ప్రతిభను గుర్తించి వాళ్లకు తగిన విభాగాల్లో అవకాశాలు కల్పించింది. ఇలా కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్ధస్త్. వాళ్లే ఇప్పుడు బుల్లితెరను ఏలుతున్నారు.

 వాళ్లందరికీ మేలు చేసిన జబర్ధస్త్ షో

వాళ్లందరికీ మేలు చేసిన జబర్ధస్త్ షో

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ వంటి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసిన జబర్థస్త్ షో.. యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌కు కూడా ఎనలేని క్రేజ్‌ను తీసుకు వచ్చింది. అదే సమయంలో జడ్జ్‌లుగా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబుకు సైతం బాగా ఉపకరించింది.

 నాగబాబు చేసిన పనితో పట్టుదలగా

నాగబాబు చేసిన పనితో పట్టుదలగా

చాలా కాలం పాటు జబర్ధస్త్‌కు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోను విడిచిపెట్టారు. అంతేకాదు, మరో ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. కామెడీ ప్రధానంగా నడిచే ఈ షో కూడా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ సాగుతోంది. అప్పటి నుంచి జబర్ధస్త్‌కు పోటీ కూడా ఏర్పడింది. దీంతో ఈ షో నిర్వహకులు మరింత పట్టుదలతో పని చేస్తున్నారు.

ప్రతి వారం సరికొత్త ప్రయోగాలతో రెడీ

ప్రతి వారం సరికొత్త ప్రయోగాలతో రెడీ

ప్రతి వారం బెస్ట్ ఎపిసోడ్స్ ఇవ్వాలన్న పట్టుదలతో పని చేస్తున్న జబర్ధస్త్ యూనిట్.. సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే స్కిట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. అంతేకాదు, వారం వారం ప్రేక్షకులు ఆదరించే కంటెంట్‌ను వాడుకుని ఎపిసోడ్‌ను రూపొందిస్తున్నారు. ఫలితంగా మంచి ఫలితాలు రాబడుతున్నారు.

జబర్ధస్త్‌లోకి బాలయ్య.. రోజా వెల్‌కం

వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎంతో సందడిగా జరగనుంది. అన్ని టీమ్‌లు తమకు నచ్చిన సినిమా స్ఫూఫ్‌లతో స్కిట్లను రూపొందించాయి. ఇందులో భాగంగానే బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్ లెజెండ్ తరహా క్యారెక్టర్‌ను క్రియేట్ చేసింది. ఇందులో పొట్టి నరేష్.. నందమూరి బాలకృష్ణగా కనిపించాడు. అతడు ఎంట్రీ ఇవ్వగానే చేయి ఊపుతూ రోజా వెల్‌కం చెప్పారు.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
రష్మీతో జన్మ జన్మల బంధం అంటూ

రష్మీతో జన్మ జన్మల బంధం అంటూ

అంతకుముందు సుడిగాలి సుధీర్ టీమ్ ‘మగధీర' సినిమా స్ఫూఫ్ చేసింది. అందులో సుధీర్ ఖాళీ బీరువా (కాల భైరవ) పాత్రను పోషించగా, రష్మీ ఇత్తడి బిందె (మిత్రవింధ)లా కనిపించింది. ఇక, గెటప్ శ్రీను షేరిట్ ఖాన్ (షేర్ ఖాన్)లా కనిపించాడు. ఈ స్కిట్‌లో భాగంగా ఖాళీ బీరువా.. ఇత్తడి బిందెతో రొమాన్స్ చేశాడు. అలాగే, తమది జన్మ జన్మల బంధం అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X