ఫైమా అంత మంది మగాళ్ల జీవితాలను నాశనం చేసింది: బయటపెట్టిన స్టార్ కమెడియన్
జబర్ధస్త్ ఫైమా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి బుల్లితెరపై సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
మరీ ముఖ్యంగా జబర్ధస్త్ షోలో ఫైమా తనదైన మార్క్ కామెడీని పంచుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ముగ్గురు మగాళ్ల జీవితాలతో ఆడుకుందని ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

అలా ఎంటరై.. స్టార్‌గా
ఎంతో టాలెంట్ ఉన్న ఫైమా 'పటాస్' షో ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో తనదైన శైలి కామెడీతో అలరించిన ఈ అమ్మడు.. అది ఆగిపోవడంతో జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే టాలెంట్‌ను చూపించి సత్తా చాటింది. ఫలితంగా ఫైమాకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమై బుల్లితెర స్టార్‌గా ఎదిగిపోయింది.

బిగ్ బాస్‌తో ఫుల్లుగా
జబర్ధస్త్ షో ద్వారా సంచలనం అయిపోయిన ఫైమాకు చాలా ఆఫర్లు లభించాయి. ఇలా ఆ మధ్య ప్రసారం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఫైమా ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది. ఇలా ఫినాలే ముందు వరకూ వచ్చి ఎలిమినేట్ అయిపోయింది.

అందులో గెలిచింది
బిగ్ బాస్ షోతో క్రేజ్ రెట్టింపు చేసుకున్న ఫైమాకు బుల్లితెరపై ఫుల్లుగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో కంటెస్ట్ చేసింది. ఇందులో సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఫైమా.. అదిరిపోయే డ్యాన్స్‌తో అలరించింది. ఫలితంగా వీళ్లిద్దరూ ఏకంగా టైటిల్‌ను గెలిచారు. తద్వారా ఆమె స్థాయి పెరిగిపోయింది.
ఫుల్లు షోలతో బిజీగా
బిగ్ బాస్ షో తర్వాత ఫైమా స్టార్ మాలోనే చాలా కాలం చేయాల్సి వచ్చింది. ఇలా 'స్టార్ మా పరివారం' షోలో చేసింది. దీనితో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా భాగం అవుతోంది. అయితే, ఇటీవలే ఫైమా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అందులో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో సభ్యురాలిగా యమా సందడి చేస్తూ ముందుకు వెళ్తోంది.

ప్రవీణ్‌తో విడిపోయి
కెరీర్ పరంగా జబర్ధస్త్ ఫైమా ఎంత సక్సెస్ చేసుకుందో.. పర్సనల్ లైఫ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ సాగుతోంది. ఆమె 'పటాస్' షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగించింది. కానీ, అతడికి ఆమె బ్రేకప్ చెప్పేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫైమానే స్వయంగా ప్రవీణ్‌ను ఎప్పుడూ ప్రేమించలేదని వెల్లడించింది.

నాశనం చేసేసింది
జబర్ధస్త్ కమెడియన్ ప్రవీణ్‌తో బ్రేకప్ అయిన తర్వాత ఫైమా ఎఫైర్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోలో భాగంగా చేసిన స్కిట్‌లో పొట్టి నరేష్ 'ఇది (ఫైమా) ముగ్గురి జీవితాలతో ఆడుకుంది' అని కామెంట్ చేశాడు. అతడు ఫైమాను ఫన్నీగా అన్నాడో నిజంగానే చెప్పాడో కానీ.. ఇప్పుడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











