రష్మీ గుట్టు విప్పిన జబర్ధస్త్ కమెడియన్: కాళ్లు పట్టుకుని వేడుకున్నా.. కనికరించకుండా బెదిరింపులు

తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. వారంతా చేతి నిండా షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే, ఒక్కరు మాత్రమే కేవలం ఒకే షో చేసినా ఎనలేని గుర్తింపుతో పాటు పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అమె ఎవరో కాదు.. జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్. దాదాపు ఏడేళ్లుగా ఈ షోను హోస్ట్ చేస్తోన్న ఈ బ్యూటీ.. రోజు రోజుకూ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతోంది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా పేరు సంపాదించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మీ గౌతమ్ గుట్టు విప్పాడు జబర్ధస్త్ కమెడియన్. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ ఇచ్చింది... ఇలా ఫేమస్ అయింది

అలా ఎంట్రీ ఇచ్చింది... ఇలా ఫేమస్ అయింది

చాలా ఏళ్ల క్రితం 'జబర్ధస్త్' షో ద్వారా యాంకర్‌గా బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. అప్పటి నుంచి ఆమె అందులో కొనసాగుతోంది. దీనికి కారణం ఈ షో వల్ల ఆమెకు ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ రావడమే. ఈ షో వల్ల ఆమె ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి కూడా. అయితే, డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' తప్ప రష్మీ చాలా షోలను వదులుకుందనే చెప్పాలి.

వాటితోనే సరిపెట్టుకుంది.. అసలు కారణమిదే

వాటితోనే సరిపెట్టుకుంది.. అసలు కారణమిదే

సుదీర్ఘమైన కెరీర్‌లో కేవలం జబర్ధస్త్‌లోనే రష్మీ గౌతమ్ పర్మినెంట్ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. దీనికి మాత్రమే ఆమె పరిమితం అవడానికి కారణం రెమ్యూనరేషన్‌ అని తెలుస్తోంది. అందులో ఆమెకు అడిగిన దాని కంటే ఎక్కువ అందించడం వల్లే యాంకర్‌గా కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతెందుకు.. మరో యాంకర్ అనసూయ కంటే ఈమెకు ఎక్కువ వస్తుందని సమాచారం.

సినిమా పరంగా నిరాశనే.. అదొక్కటే ఆడింది

సినిమా పరంగా నిరాశనే.. అదొక్కటే ఆడింది

యాంకర్‌గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును అందుకోలేకపోయింది. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసింది. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. ఇందులో ఆమె హాట్ షో చేసి ఈ ఫలితాన్ని రాబట్టింది. మిగిలిన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా యావరేజ్ టాక్‌ను కూడా తెచ్చుకోలేదు.

 సుధీర్‌తో లవ్ ట్రాకు.. ఎనలేని క్రేజ్ దక్కిందిగా

సుధీర్‌తో లవ్ ట్రాకు.. ఎనలేని క్రేజ్ దక్కిందిగా


రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నదో... అంతకంటే ఎక్కువ శాతం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ వల్ల సంపాదించుకుంది. అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఖండించినా ప్రచారం ఆగడం లేదు.

లేదు లేదు అంటూనే రచ్చ చేస్తున్న యాంకర్

లేదు లేదు అంటూనే రచ్చ చేస్తున్న యాంకర్


సుడిగాలి సుధీర్‌తో దాదాపు ఐదారేళ్లుగా ట్రాక్ నడుపుతోంది రష్మీ గౌతమ్. దీంతో ఒంటరిగా కంటే జంటగానే ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తరచూ అతడితో ఏదో ఒక రొమాంటిక్ యాక్ట్ చేస్తూనే ఉంది. మా ఇద్దరి మధ్య ఏమీ లేదని, స్నేహితులుగానే ఉంటున్నామని చెబుతోందామె. కానీ, షోలు, ఈవెంట్లలో మాత్రం సుధీర్‌తో రచ్చ చేస్తోంది యాంకర్ రష్మి.

యాంకర్ గుట్టు విప్పిన జబర్ధస్త్ కమెడియన్

యాంకర్ గుట్టు విప్పిన జబర్ధస్త్ కమెడియన్


వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో పొట్టి నరేష్‌తో పాటు బుల్లెట్ భాస్కర్ కలిసి రష్మీ గౌతమ్ గుట్టు విప్పారు. ఆమె కారణంగా సుడిగాలి సుధీర్ ఎదుర్కొంటోన్న సమస్యలను వెల్లడించారు. ఈ క్రమంలోనే రష్మీపై నరేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

కాళ్లు పట్టుకుని వేడుకున్నా.. బెదిరింపులు

కాళ్లు పట్టుకుని వేడుకున్నా.. బెదిరింపులు


స్కిట్‌లో భాగంగా సుధీర్‌ను పొగుడుతూ.. పొట్టి నరేష్ 'సార్ మీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా.. రష్మీ మేడమ్. అవును.. మీరే ఆయన వెంట పడి రోజూ టార్చర్ చేస్తున్నారు. నీ కాళ్లు పట్టుకుంటా.. ఆయనను వదిలేయమ్మా.. రష్మిక మందన్నాతో చేయాల్సినోడు.. రష్మీతో చేయాల్సి వస్తుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పుడు రష్మీ కాళ్లు విరగ్గొడతా అని బెదిరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X