జబర్ధస్త్‌లో షాకింగ్ సీన్: వర్షను అక్కడ నొక్కిన కమెడియన్.. లేడీ గెటప్ అనుకున్నా అంటూ దారుణం!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రజాదరణను అందుకుంటూ సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దాదాపు పదేళ్లుగా ప్రసారం అవుతోన్న దీనికి ఒకే తరహా రేటింగ్ వస్తోంది. అందుకే దీనికి పోటీగా ఎన్ని కొత్త షోలు వచ్చినా పోటీని తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోతోన్నాయి. ఇదిలా ఉండగా, వారం వారం సరికొత్త ప్రయోగాలు చేస్తూ నిర్వహకులు షోను మరింత హాస్యభరితంగా మార్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామెడీ షోలో ఊహించని సంఘటన జరిగింది. ఓ కమెడియన్ వర్షను తాకి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

వాళ్లందరికీ లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్

వాళ్లందరికీ లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్

కొన్నేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది జబర్ధస్త్ షో. ఈ క్రమంలోనే టాలెంట్ ఉండి, నిరూపించుకునే ప్లాట్‌ఫాం దొరకని ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చిందీ షో. అంతేకాదు, ఎంతో మంది ప్రతిభను గుర్తించి వాళ్లకు తగిన విభాగాల్లో అవకాశాలు కల్పించింది. ఇలా కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. వాళ్లే ఇప్పుడు స్టార్లుగా సత్తా చాటుతోన్నారు.

అందరూ వెళ్లిపోవడంతో షాక్‌లు

అందరూ వెళ్లిపోవడంతో షాక్‌లు

గతంలో మాదిరిగా ఇప్పుడు జబర్ధస్త్ షోలో పేరున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా జడ్జ్‌లు నాగబాబు, రోజా ఎప్పుడో తప్పుకున్నారు. అలాగే, యాంకర్ అనసూయ కూడా షోకు దూరమైంది. వీరితో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అదిరే అభి, ముక్కు అవినాష్ వంటి టాలెంటెడ్ టీమ్ లీడర్లు బయటకు వెళ్లిపోవడం షోకు మైనస్‌గా మారిపోయింది.

సరికొత్త ప్రయోగాలతో కొత్త ప్లాన్స్

సరికొత్త ప్రయోగాలతో కొత్త ప్లాన్స్

చాలా మంది పెద్ద వాళ్లు వెళ్లిపోవడంతో జబర్ధస్త్ రేటింగ్‌పై ప్రభావం పడుతోంది. దీంతో ప్రతి వారం బెస్ట్ ఎపిసోడ్స్ ఇవ్వాలన్న పట్టుదలతో పని చేస్తున్న యూనిట్.. సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ స్కిట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మజాను పంచుతోన్నారు.

రేటింగ్ కోసం ట్రాకులు హైలైట్

రేటింగ్ కోసం ట్రాకులు హైలైట్

జబర్ధస్త్ టీమ్ సభ్యులు వారం వారం ప్రేక్షకులు ఆదరించే కంటెంట్‌ను వాడుకుని ఎపిసోడ్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కువగా లవ్ ట్రాకులపైన కూడా ఫోకస్ చేస్తోన్నారు. మరీ ముఖ్యంగా ఇమాన్యూయేల్, వర్షను ఒక జంటగా మార్చి బాగా హైలైట్ చేస్తోన్న విషయం తెలిసిందే. రష్మీ - సుధీర్‌లా వీళ్లు సక్సెస్ కాకున్నా నిర్వహకులు ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు.

మరింత సందడిగా వస్తుందిగా

మరింత సందడిగా వస్తుందిగా

వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో టీమ్ లీడర్ల పంచులు, ఆర్టిస్టుల అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లు, జడ్జ్‌లు కుస్భూ అందాలు, కృష్ణ భగవాన్ పంచులు హైలైట్ అయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే, దీనికి సంబంధించిన ప్రోమో బాగా వైరల్ అయిపోతోంది.

మరోసారి జల జల జల పాతం

ఎక్స్‌స్ట్రా బజర్ధస్త్ ఎపిసోడ్‌లో భాగంగా ఇమాన్యూయేల్ - వర్ష మధ్య మరోసారి రొమాంటిక్ సన్నివేశాలను చూపించారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్‌కు పడవలో వెళ్తున్నట్లు స్కిట్ చేశారు. ఇందులో 'ఉప్పెన' సినిమాలోని రొమాంటిక్ సాంగ్ 'జల జల జల పాతం నువ్వు'కు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అల్లుకుపోయారు. ఇదంతా ఎంతో క్యూట్‌గా రావడంతో పాటు హైలైట్ అయింది.

ఆమెను నొక్కేసిన పొట్టి నరేష్

ఆమెను నొక్కేసిన పొట్టి నరేష్

పాట తర్వాత ఆ పడవలోకి బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ ఎంట్రీ ఇచ్చి స్కిట్‌ను హై రేంజ్‌కు పెంచే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే నరేష్ 'ఈమె లేడీ గెటప్ కాదా సార్' అని ఇమాన్యూయేల్‌ను ప్రశ్నించాడు. ఆ వెంటనే ఆమె బుగ్గపై నొక్కుతూ గట్టిగా గిల్లేశాడు. దీంతో ఇమ్మూ 'అరేయ్... ఎవడ్రా నువ్వు? నా పెళ్లాన్నే గిల్లుతున్నావు' అంటూ నరేష్‌ను రెండు పీకాడు. మొత్తానికి వర్షను మళ్లీ అవమానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X