శివ పార్వతమ్మ విషయంలో జరిగింది ఇదే.. అందుకే అలా మాట్లాడారు.. క్లారిటీ ఇచ్చిన ప్రభాకర్
నటి శివ పార్వతమ్మకు వదినమ్మ సీరియల్ యూనిట్, నటుడు ప్రభాకర్‌పై చేసిన ఆరోపణలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కరోనా వస్తే చూసే దిక్కులేదని శివ పార్వతి వాపోయింది. ఎలా ఉంది? ఏ హాస్పిటల్‌లో ఉంది? అనేవి కూడా తెలుసుకోలేదని బాధపడింది. ఓ ఆర్టిస్ట్ ప్రాణాల మీదికి వస్తే ఇలానేనా వ్యవహరించేందని తన బాధనంతా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో వదిలిపింది. అయితే శివ పార్వతి వీడియోపై తాజాగా ప్రభాకర్ స్పందించాడు.

స్పందించమని అడుగుతున్నారు..
అందరికీ నమస్కారం అండి.. నిన్న శివ పార్వతమ్మ గారు ఓ వీడియోను రిలీజ్ చేశారు. దానిపై స్పందించమని నన్ను అభిమానించేవాళ్లు.. అది నిజమని నమ్మేవాళ్లు.. ఏం జరిగిందో తెలుసుకుందామనుకునే మీడియా వాళ్లు.. చాలా మంది అడుగుతున్నారు అని ప్రభాకర్ చెప్పుకొచ్చాడు.

అమ్మ మాట్లాడలేదు..
సో.. ఇంత మంది శ్రేయోభిలాషులు అడుగుతున్నా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే.. ఇన్ని రోజుల తరువాత అమ్మను చూడటం ఆ వీడియోలోనే. ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్‌లు గానీ, నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు. వాళ్ల అబ్బాయి మాట్లాడాడు అని ప్రభాకర్ పేర్కొన్నాడు.

అందుకే ఆ వీడియోలో అలా..
ఆ విషయాలు అమ్మకి తెలియవు.. అందుకే వీడియోలో అలా మాట్లాడారు. అయినా నేను అమ్మ కోలుకున్నాకే మాట్లాడుదాం అనుకున్నాను. అయితే ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. ‘సారీ బాబు విషయం తెలియక మిస్ అండర్ స్టాండింగ్ వల్ల తప్పు జరిగింది. నేను యూట్యూబ్‌లో పెట్టలేదు.. నాకు అసలు వాటి గురించి తెలియదు.. నేను మన వదినమ్మ గ్రూప్‌లోనే పెట్టాను..అది ఎలా వెళ్లిందో నాకు తెలియదు.. అసలేం జరిగిందో ఇంకోవీడియోను పెడతానని అంది.' అని శివ పార్వతి తనతో అన్నట్టు ప్రభాకర్ వెల్లడించాడు.

త్వరలోనే క్లారిటీ..
అమ్మ ఈ వీడియోలు పెట్టడం వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా అండగా ఉంటాం. సాయం చేస్తాం. శివ పార్వత్మకు కరోనా వచ్చిన దగ్గరి నుంచి ఈ రోజు వరకు ఆమెకు సాయం చేసిన శివ బాలాజీ, జీవిత రాజశేఖర్ వంటి వారికి థ్యాంక్స్.. ఈ విషయంపై నేను, అమ్మ మళ్లీ క్లారిటీ ఇస్తాం. ముందుగా అమ్మ కోలుకోవాలని ప్రార్థిద్దామని ప్రభాకర్ కోరాడు.

ప్రభాకర్‌పై ఆరోపణలు..
నిన్న శివ పార్వతి వీడియో సోషల్ మీడియాలో ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ నోట్లో నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందని చెప్పారు, కనీసం పలకరించలేదు, బాగోగులు పట్టించుకోలేదని, ఏం ఆర్టిస్ట్‌లంటూ కాస్త అసహనికి గురైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











