ప్రభాస్‌ శారీ గిఫ్ట్ వెనుక స్టోరీ ఇదే... రాజా సాబ్‌తో రిలేషన్‌పై రిద్ధి కుమార్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనే నెంబర్‌వన్. ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా, కల్మషం లేకుండా ఒదిగే ఉంటారు ప్రభాస్. ఆయన వ్యక్తిత్వమే ప్రభాస్‌ను కోట్లాది మందికి చేరువ చేసింది. ఇటీవల జరిగిన ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దర్శకుడు మారుతికి అండగా నిలవడంతో పాటు సీనియర్ హీరోలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే సంక్రాంతికి రిలీజయ్యే ప్రతి సినిమా హిట్ కావాలని ప్రభాస్ ఆకాంక్షించారు.

రిద్దికుమార్‌కు ప్రభాస్ గిఫ్ట్
ఇక ఇదే ఈవెంట్‌లో ది రాజా సాబ్‌లో ప్రభాస్ సరసన నటించిన రిద్ది కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన మాటలతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌కు వైట్ కలర్ శారీలో వచ్చి మెరిసిపోయారు. ఈ సందర్భంగా వేదికపై రిద్ది మాట్లాడుతూ.. ప్రభాస్.. నువ్వు నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌కు థ్యాంక్స్. ఈ చీరను నువ్వు మూడేళ్ల క్రితం నాకు బహూకరించావు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో దానిని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే మూడేళ్ల పాటు దానిని జాగ్రత్తగా దాచుకున్నానని రిద్ది కుమార్ ఎమోషనల్ అయ్యారు.

Prabhas Gift to Riddhi Kumar Truth Behind The Raja Saab Event Gossip

రిద్ధికుమార్ - ప్రభాస్ రిలేషన్‌పై గాసిప్స్
ఆమె వ్యాఖ్యలతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ప్రభాస్ లాంటి సూపర్‌స్టార్‌ని అలా ఏకవచనంలో సంబోధించడంతో పాటు ప్రభాస్ అని పేరు పెట్టి పిలవడం.. డార్లింగ్ చీరను గిఫ్ట్‌గా ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే రిద్దికుమార్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు చెబుతుంటే.. ప్రభాస్, రిద్ధికుమార్ రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

ప్రభాస్ చీరపై రిద్దికుమార్ క్లారిటీ
ఇదిలాఉండగా .. ప్రస్తుతం ది రాజా సాబ్ ప్రమోషన్స్‌‌లో భాగంగా రిద్దికుమార్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ చీర గిఫ్ట్‌గా ఇవ్వడం, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటీ? అంటూ యాంకర్లు ప్రశ్నించడంతో రిద్ది ఇబ్బందిపడుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ శారీ గిఫ్ట్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ది రాజా సాబ్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

దీపావళి పార్టీకి వెళ్లలేకపోయా
మూడేళ్ల క్రితం దీపావళి పండుగ ముగిసిన తర్వాత రాజా సాబ్ సెట్స్‌లో ఫస్ట్ టైం అడుగుపెట్టా.. ఆ రోజు అక్టోబర్ 23.. ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు ప్రభాస్ గారు అక్కడే ఉండటంతో నేను ఆయనకి గిఫ్ట్ ఏదైనా ఇద్దామని అనుకున్నాను. దీనిలో భాగంగా రెండ్రోజుల తర్వాత దీపావళి పార్టీ జరగ్గా.. దానికి నేను హాజరుకాలేకపోయాను. మారుతి సార్ నాతో ప్రభాస్ మాట్లాడతారని చెప్పారు. ప్రభాస్‌తో కాల్‌లో మాట్లాడినప్పుడు .. మీకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పగా ఆయన అంగీకరించారు. అలాగే నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు అని రిద్దికుమార్ అన్నారు.

ప్రభాస్‌ది కర్ణుడి నేచర్
నేను మహాభారతంలోని కర్ణుడి జీవిత కథ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన మృత్యుంజయ్ బుక్ తీసుకుని వెళ్లాను. కర్ణుడి తత్వం, ప్రభాస్ మనస్తత్వం రెండూ చాలా దగ్గరిగా ఉంటాయి. అందుకే ఈ బుక్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాను. అదే సమయంలోప్రభాస్ గారు.. నాకు చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు. దానిని మూడేళ్ల పాటు దాచుకున్నా, ఇప్పుడు రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కట్టుకున్నా అని రిద్దికుమార్ క్లారిటీ ఇచ్చారు. దాంతో వారిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లేనని నెటిజన్లు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X