Radhe Shyam TRP: టెలివిజన్ లో కూడా ప్రభాస్ సినిమాకు షాకింగ్ రిజల్ట్.. దారుణంగా టీఆర్పీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా సక్సెస్ అందుకున్న తరువాత కూడా అదే తరహాలో మంచి విజయాలను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత సినిమాలపై కూడా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. దీంతో తప్పకుండా సక్సెస్ అవుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సంతృప్తికరంగా సక్సెస్ అందుకోవడం లేదు.
విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా పాన్ ఇండియా మొత్తంలో అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ లో కూడా అంతగా మంచి రెస్పాన్స్ ఏమీ సాధించలేదు.

ఇక ఇప్పుడు టెలివిజన్ లో కూడా ఈ సినిమాకు అనుకున్నంత మేర రేటింగ్స్ కూడా దక్కలేదు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా కూడా టెలివిజన్లో ప్రసారం అయినప్పుడు భారీ స్థాయిలోనే రేటింగ్స్ అందుకుంటాయి. ఇక మొదటి సారి ప్రభాస్ లాంటి హీరోలు పాత రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ప్రభాస్ సినిమాకు కేవలం ఒక మీడియం రేంజ్ సినిమాకు వచ్చినంత రేటింగ్స్ కూడా రాకపోవడం విశేషం. రాధే శ్యామ్ సినిమా ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన ప్రీమియర్స్ కు కేవలం 8.25 రేటింగ్ మాత్రమే దక్కింది.
ఒక విధంగా ఇది ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఓ వర్గం అభిమానులకు ఈ సినిమా నచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే సంతృప్తి పరచలేదని చాలా క్లారిటీగా అర్థం అయింది. అటు బాక్సాఫీస్ వద్ద అలాగే ఓటీటీ లో కూడా ఈ సినిమా మొత్తానికి ఫ్లాప్ అని మరోసారి అర్థమైపోయింది. మరి రాబోయే సినిమాల విషయంలో ప్రభాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. నెక్స్ట్ ఆదిపురుష్ సంక్రాంతికి రానుంది.


Click it and Unblock the Notifications











