యాంకర్ ప్రదీప్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ: ప్రభాస్ ఇచ్చిన షాక్‌తో అయోమయం

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలంగా తన హవాను చూపిస్తూ టాప్ యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న అతడు.. పాపులారిటీని సైతం అదే స్థాయిలో దక్కించుకున్నాడు. అద్భుతమైన టైమింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రదీప్‌కు భారీ షాక్ ఇచ్చాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

మగవారిలో ప్రదీప్‌కు మాత్రమే సాధ్యమైంది

మగవారిలో ప్రదీప్‌కు మాత్రమే సాధ్యమైంది

కెరీర్ ఆరంభంలో రేడియో జాకీగా పని చేశాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే ప్రత్యేకమై షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్‌లో ఆకట్టుకోవడంతో అదే ఛానెల్ ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోలో అవకాశం కల్పించింది. ఆడవాళ్లతో సాగే ఈ షోను ప్రదీప్ ఒంటి చేత్తే నడిపించాడు. ఫలితంగా బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును అందుకున్నాడు.

వరుసగా షోలు... అన్నింట్లోనూ సూపర్‌గా

వరుసగా షోలు... అన్నింట్లోనూ సూపర్‌గా

ఆరంభంలో చేసిన షోలన్నీ సూపర్ హిట్ అవడంతో ప్రదీప్‌కు యాంకర్‌గా మంచి పేరు వచ్చింది. అదే సమయంలో పలు ఛానెళ్ల నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ‘ప్రదీప్ దర్భార్', ‘ఎక్స్‌ప్రెస్ రాజా', ‘అదుర్స్', ‘నర్తనశాల', ‘కిక్', ‘డ్రామా జూనియర్స్', ‘ఢీ', ‘లక్ష్మీ దేవి తలుపు తడితే', ‘సరిగమప' వంటి ఎన్నో షోలలో యాంకర్‌గా పని చేసి మెప్పించాడీ కుర్రాడు.

చిన్న పాత్రల నుంచి సినిమా హీరో స్థాయి

చిన్న పాత్రల నుంచి సినిమా హీరో స్థాయి

బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటిన ప్రదీప్ మాచిరాజు... సినిమాల్లోనూ తన మార్క్ చూపించే పాత్రలను పోషించాడు. వాటిలో పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ మూవీ ‘జులాయి', నాగ చైతన్య హిట్ చిత్రం ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా'లలో అతడి నటన ఆకట్టుకుంది. దీంతో రెండు రంగాల్లో అతడు రాణించినట్లైంది.

సొంతంగా షో... మూడు సీజన్లు కంప్లీట్

సొంతంగా షో... మూడు సీజన్లు కంప్లీట్

యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే జీ తెలుగు ఛానెల్ సహకారంతో సొంతంగా ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' షోను ప్రారంభించాడు ప్రదీప్ మాచిరాజు. సినీ ప్రముఖులతో ముచ్చటించే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు, 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుందీ షో. దీనికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా విచ్చేశారు.

యాంకర్ ప్రదీప్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ

యాంకర్ ప్రదీప్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ

తెలుగులో విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా'ను మరోసారి బుల్లితెరపైకి తీసుకు రావాలని ప్రదీప్ మాచిరాజు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం పలువురు సినీ ప్రముఖులతో సైతం మంతనాలు జరుపుతున్నాడు. ఇక, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పున: ప్రారంభించాలని భావిస్తోన్న తరుణంలో ప్రదీప్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
ప్రభాస్ ఇచ్చిన షాక్‌తో అయోమయంలో

ప్రభాస్ ఇచ్చిన షాక్‌తో అయోమయంలో

‘బాహుబలి 2' విడుదల సమయంలో యాంకర్ ప్రదీప్ జీ తెలుగు ఆధ్వర్యంలో ప్రభాస్, అనుష్కతో చిట్ చాట్ నిర్వహించాడు. అది ఎంతో ఫన్నీగా సాగడంతో మరోసారి ఇలాంటిది ప్లాన్ చేద్దామని యంగ్ రెబెల్ స్టార్ చెప్పాడట. దీంతో తాజాగా ప్రదీప్.. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' సీజన్ 5 కోసం ప్రభాస్‌ను సంప్రదించగా, అతడు తిరస్కరించాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X