Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ విషయంలో ప్రభాస్ సినిమా, అజ్ఞాతవాసి కంటే దారుణం.. అతి తక్కువగా..
టాలీవుడ్ స్టార్ హీరోల్లో నిత్యం బాక్సాఫీస్ వద్ద పోటీ జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు ఆ పోటీలు అలానే కొనసాగుతూ ఉంటాయి. దానికి తోడు అభిమానులు కూడా ఆ పోటీలలో తీవ్రంగా కష్టపడుతూ వారి అభిమాన హీరో రేంజ్ పెరగడానికి కృషి చేస్తారు. అయితే ఇటీవల ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సాహో ఒక డిజాస్టర్ రికార్డ్ ను నమోదు చేసింది.
దారుణంగా దెబ్బకొట్టిన సినిమా
ప్రభాస్ బాహుబలి అనంతరం ఏ స్థాయిలో తన క్రేజ్ ని పెంచుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ తరువాత సాహోకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. ఒక్క హిందీలో తప్పితే మిగతా చోట్ల కలెక్షన్స్ ని కనీసం రికవరీ కూడా చేయలేకపోయాయి. సాహో కొందరి బయ్యర్లను దారుణంగా దెబ్బ కొట్టింది.
రేటింగ్స్ లో దారుణంగా..
ఇక ఇటీవల ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ తెలిక్యాస్ట్ రేటింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఓ వర్గం వారిని సినిమా బాగానే ఎట్రాక్ట్ చేసినట్లు విడుదలైనప్పుడు ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఊహించని విధంగా టీఆర్పీ 5.8 మాత్రమే వచ్చింది. 100కోట్ల మార్కెట్ ఉన్న ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఈ స్థాయిలో ప్రీమియర్స్ కి రేటింగ్స్ అందలేదు. ఇదే అతితక్కువ TRP అని తెలుస్తోంది.
అందరికంటే తక్కువగా..
ఒక విధంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కంటే దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. ఆ సినిమా ప్రీమియర్స్ కి 6.1 రేటింగ్ వచ్చింది. ఇక కార్తికేయ గుణ 361కూడా ఇటీవల మొదటిసారి టీవీలో ప్రసారం కాగా 5.9 టీఆర్పీ వచ్చింది. మిగతా హీరోల హిట్ సినిమాలు ప్లాప్ సినిమాలు కూడా 6 కంటే ఎక్కువగానే ఉన్నాయి.
Recommended Video
అనుకున్నంతగా రెస్పాన్స్ రావడం లేదు
మిగతా స్టార్ హీరోల సినిమాలు మొదటిసారి టీవీలలో వచ్చిన అతి తక్కువ TRPలు ఈ విధంగా ఉన్నాయి. సరైనోడు 6.2, స్పైడర్ 6.7, ఖైదీ నెంబర్ 150 6.93, బ్రహ్మోత్సవం 7.52, వినాయవిధేయ రామ 8.1. నిజంగా ఈ మధ్య కాలంలో టీవీలలో TRPలలో కూడా సినిమాలకు అనుకున్నంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఓటీటీలోనే బ్రేక్ లేకుండా సినిమాలు వస్తుండడం వలన ఆ తరువాత మళ్ళీ టీవీలలో చూడటానికి జానాలు పెద్దగా ఇష్టపడటం లేదు.