Adipurush: ప్రభాస్ మూవీకి షాకింగ్ టీఆర్పీ రేటింగ్.. ఇది ఎవరూ ఊహించి ఉండరుగా!

పేరుకు తెలుగు పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకుని భారీ చిత్రాలతో సత్తా చాటుతోన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో అతడు చేసిన సినిమాలు అన్నీ పరాజయం పాలవుతున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొద్ది రోజుల క్రితమే ఈ స్టార్ హీరో 'ఆదిపురుష్' అనే మూవీని చేసిన విషయం తెలిసిందే. రామాయణం నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. దీంతో ఎన్నో అంచనాలతో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ తెరకెక్కించిన సినిమానే 'ఆదిపురుష్'. టెక్నికల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే దీనికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. వేరే భాషల్లో సైతం ఇది పెద్దగా రాణించలేదు. ఫలితంగా 'ఆదిపురుష్' మూవీ నష్టాలతోనే రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమా ఇదే రీతిలో తక్కువ రెస్పాన్స్‌నే అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి ఓ ఊరట లభించింది.

Prabhas Starrer Adipurush Movie Gets Decent TRP Rating in First Telecast

థియేటర్లు, ఓటీటీలో నిరాశ పరిచిన 'ఆదిపురుష్' మూవీ.. ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి తక్కువ రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 9.47 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 8.41 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన 'ఆదిపురుష్' ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టడం గొప్ప విషయం అనే చెప్పాలి. అంతేకాదు, ప్రభాస్ గత చిత్రాలు 'రాధే శ్యామ్', 'సాహో' కంటే దీనికి ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఇక, అతడి కెరీర్‌లో 'బాహుబలి 2' 22.7, 'బాహుబలి 1' 21.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ప్రభాస్ రాఘవుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X