Salaar: 700 కోట్ల సలార్‌కు బిగ్ షాక్.. పవన్ ఏవరేజ్ మూవీ కంటే తక్కువగా!

తెలుగు సినిమా స్థాయి పెరగడంతో ఇక్కడ అతి భారీ సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అందులో ఎక్కువ శాతం ఒకే ఒక్క హీరో ఈ తరహా మూవీలు చేస్తున్నాడు. అతడే రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ పాన్ ఇండియా స్టార్ వరుసగా మూవీల మీద మూవీలు చేస్తున్నాడు. అలా గత ఏడాది ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 700 కోట్లు పైగా గ్రాస్ మార్క్‌ను కూడా దాటేసింది. సంక్రాంతి సినిమాల కారణంగా 'సలార్' రన్‌ ముందుకు సాగలేదు. అయినప్పటికీ మంచి లాభాలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్‌ను ఇది మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించేసింది.

Prabhas Starrer Salaar Movie Gets Low TRP Rating in First Telecast

సెన్సేషనల్ కాంబోలో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో థియేటర్లలో మాదిరిగా కాకుండా ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోని బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇలా చాలా వారాల పాటు ప్రభాస్ సినిమా టాప్‌లో ట్రెండింగ్ అయింది.

థియేటర్లలో, ఓటీటీలోనూ ఓ రేంజ్‌లో రచ్చ లేపిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ.. కొద్ది రోజుల క్రితమే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది తక్కువే లభించింది. దీంతో ఈ సినిమాకు దారుణమైన రేటింగ్‌ నమోదు అయింది.

Prabhas Starrer Salaar Movie Gets Low TRP Rating in First Telecast

పవర్‌ఫుల్ స్టోరీతో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రానికి అర్బన్ ఏరియాలో 6.52 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 5.26 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కంటే తక్కువ రేటింగే అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్లాప్ మూవీ 'బ్రో' రేటింగ్ (7.24)ను కూడా ఇది దాటలేకపోయిందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X