God Father: చిరంజీవి కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్.. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు స్టార్లతో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నలభై ఏళ్ల పాటు ఎన్నో సినిమాలతో అలరించిన ఆయన.. రాజకీయాల కోసం చాలా ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఖైదీ నెంబర్ 150' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే 'సైరా: నరసింహా రెడ్డి' అనే భారీ బడ్జెట్ మూవీని చేశారు. అయితే, ఇది అంతగా ఆకట్టుకోకపోయినా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ఈ సీనియర్ హీరో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. అయితే, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. దీంతో కలెక్షన్లు అనుకున్న రీతిలో రావడం లేదు. ఫలితంగా ఈ చిత్రం నష్టాల దిశగా సాగుతోంది. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద చిరంజీవి ఇప్పుడు దృష్టి సారించబోతున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మిగిలిన చిత్రాలతో బిజీ కాబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలను కూడా పట్టాలెక్కించేశారు. అందులో 'గాడ్ ఫాదర్' మూవీ ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Prabhu Deva Choreography for God Father Movie

ఇటీవలే ముంబైలో జరిగిన ఓ షెడ్యూల్‌లో 'గాడ్ ఫాదర్' మూవీ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా షూట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మరో అదిరిపోయే ప్రకటన వదిలింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి ఓ పాటలో స్టెప్పులు వేయబోతున్నారట. దీన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయబోతున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రభుదేవా, మోహన్ రాజా, ఎస్ థమన్‌లు కనిపిస్తున్నారు. ఇక, ఇద్దరు స్టార్లు డ్యాన్స్ చేసే ఈ పాటపై అంచనాలు ఏర్పడుతున్నాయి.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. అలాగే, నయనతార కూడా నటిస్తోంది. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయాలని చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X