యాంకర్ ప్రదీప్‌కు షాకిచ్చిన పోలీసులు.. డ్రంక్ డ్రైవ్ కేసులో..
Recommended Video

బుల్లితెర యాంకర్ ప్రదీప్ డ్రంక్ డ్రైవ్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేసింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ప్రదీప్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రదీప్ పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరుకాకుండా కనిపించకుండా పోవడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

తాగి నడపడం క్షమించండి.. ప్రదీప్
డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంపై ప్రదీప్ రెండు రోజుల తర్వాత వీడియో ఫుటేజ్ ద్వారా స్పందించారు. మద్యం తాగి వాహనం నడపడం తప్పే. ముందస్తు షెడ్యూల్ కారణంగా నేను కౌన్సెలింగ్ హాజరుకాలేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు క్షమించండి అని ప్రదీప్ పేర్కన్నారు.

ప్రదీప్‌కు అండగా నెటిజన్లు
ప్రదీప్ వీడియో ఫుటేజ్‌పై ఫ్యాన్స్, నెటిజన్లు స్పందించారు. కొందరు ప్రదీప్‌ను చూసి జాలిపడ్డారు. మరికొందరు అతడికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆసక్తికరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

పిల్లాడు సార్.. వదిలేయండి..
ప్రదీప్ వ్యవహారంపై పోలీసులను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్.. సార్ మా యాంకర్ ప్రదీప్‌ను వదిలేయండి. పాపం చిన్న పిల్లాడు. తెలియక చేశాడు అని ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు.

నెటిజన్లకు పోలీసుల చురక
నెటిజన్ పోస్ట్‌ను చూసిన ట్రాఫిక్ పోలీసులు ఓ చురక అంటించారు. మేము ఎవరినీ గౌరవ పరచం. చిన్నపిల్లాడు అయితే పాలు తాగాలి కానీ మందు తాగి వాహనం నడపడం కరెక్ట్ కాదు కాదా? సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని పోలీసులు పేర్కొన్నారు.

ప్రదీప్ కోసం వెయిటింగ్
కాగా, ప్రదీప్ రాక కోసం ట్రాఫిక్ పోలీసులే కాదు.. మీడియా కూడా పెద్ద ఎత్తున వేచిచూస్తున్నారు. కౌన్సెలింగ్ వచ్చే సమయంలో ప్రదీప్‌ను కెమెరాలో బంధించాలని భారీ సంఖ్యలో యూట్యూబ్, టెలివిజన్ ఛానెల్లు భారీ స్థాయిలో కౌన్సెలింగ్ సెంటర్లో సిద్దంగా ఉన్నారు.

ఉన్నతాధికారులపై ప్రదీప్ ఒత్తిడి
డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం నుంచి తప్పించుకొనేందుకు ట్రాఫిక్ ఉన్నతాధికారులపై ప్రదీప్ పై స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. ఓ రాజకీయ నేత చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. సోమవారం ఉదయమే ప్రదీప్ పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది.

ప్రదీప్ వీడియో సందేశంపై
కాగా, వీడియో ద్వారా ప్రదీప్ క్షమించమని కోరడంపై మంచి స్పందన వ్యక్తమవుతున్నది. ఆయన వీడియో సందేశం ద్వారా హుందాగా వ్యవహారించారు. ఎవరూ కూడా పర్‌ఫెక్ట్ కాదు, అందరూ తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని ప్రదీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











