twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమరావతి వివాదం మీద స్పందించిన యాంకర్ ప్రదీప్.. అసలు జరిగింది ఇదే అంటూ!

    |

    తెలుగు బుల్లితెర మీద యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు.. ఒక రకంగా తెలుగులో ఉన్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్ లీడింగ్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. యాంకర్ గా మంచి టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి తన లక్ పరీక్షించుకున్నారు ఆయన. అయితే అది అంత కలిసి రాలేదనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన అనుకోకుండా చేసిన ఒక కామెంట్ తో అనవసరంగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనకి పెద్ద ఎత్తున వార్నింగులు రావడంతో దాని మీద స్పందించాడు

    రాజధానుల అంశం

    రాజధానుల అంశం

    ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించింది. అనూహ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే మూడు రాజధానులు ఉండాలి అంటూ మూడు రాజధానులు ప్రకటించారు. అలా అమరావతి, కర్నూలు, విశాఖపట్నంలో రాజధానులు ఉంటాయని ఆయన ప్రకటించారు.

    రైతుల ఉద్యమం

    రైతుల ఉద్యమం

    అయితే అప్పటికే అమరావతి కోసం రైతులు వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పారు. అప్పటి ప్రభుత్వం ఒప్పందం ప్రకారం నెలకు అద్దె చెల్లిస్తూ అభివృద్ధి చెందాక కొన్ని ఫ్లాట్లు కేటాయిస్తామని మాట తీసుకున్నారు. ఇప్పుడు అసలు అభివృద్ధి మాట పక్కన పెట్టేసి రాజధాని లేదని చెప్పడంతో దాదాపు 550 రోజుల నుంచి అమరావతి కోసం అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతూ వివాదాస్పదంగా మారుతూనే ఉంటుంది.

    అమరావతి వివాదం

    అమరావతి వివాదం

    అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతున్న జీ తెలుగులోని ఒక షోకి సంబంధించిన ప్రోమో లో సీరియల్ ఆర్టిస్ట్ లతో ప్రదీప్ మాట్లాడుతూ ఒక ఆర్టిస్ట్ ని అమరావతికి సంబంధించిన ప్రశ్న వేశాడు. అమరావతి రాజధాని ఏది ఆయన ప్రశ్నించగా సదరు నటీమణి వెంటనే తడుముకోకుండా విశాఖపట్నం అని చెబుతుంది. ఆ వెంటనే తనకు జనరల్ నాలెడ్జ్ తక్కువ అని సీరియల్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడగమని కోరుతుంది.

    ప్రదీప్ కి అల్టిమేటం

    ప్రదీప్ కి అల్టిమేటం

    ఇదే వ్యవహారం అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారికి కోపం తెప్పించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రదీప్ కనుక క్షమాపణలు చెప్పకపోతే ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి, అలాగే అమరావతి జేఏసీ లాంటి కొన్ని పోరాట సమితుల నుంచి ప్రదీప్ కి అల్టిమేటం జారీ చేయడంతో ఎట్టకేలకు ప్రదీప్ దిగిరాక తప్పలేదు.

    వేరే సమాధానం ఇవ్వడంతో

    వేరే సమాధానం ఇవ్వడంతో

    ఈ విషయానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన ప్రదీప్ ఇది అంతా షోలో భాగమని తాను సిటీల పేర్లు చెప్పి వాటి రాజధానులు ఏది అని అడుగుతున్న క్రమంలో అమరావతి అనే అంశం వచ్చిందని, దానికి ఆవిడ అసలు ఆ ప్రశ్న తప్పు అని చెప్పకుండా వేరే సమాధానం ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పుదోవ పట్టి అందరికీ వేరేలా అర్థమైంది అని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
    మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా

    మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా

    ఈ విషయం అలా బయటకు వెళ్ళడం తనకు చాలా బాధ కలిగించిందని ఈ విషయంగా ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా, ఎవరిని బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తనను క్షమించాలని కోరాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్న ప్రదీప్ ఎవరినీ కించపరచాలని, హేళన చేయాలని ఎప్పుడూ అనుకోమని చెప్పుకొచ్చారు. ఇలా ఒకరిని బాధ పెట్టాలని ఉద్దేశం తమకు లేదని, ఈ విషయాన్ని తెలుగు ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకోవాలని కోరాడు. అంతే కాక అందరి ఆశీస్సులు తనకు ఉండాలని ప్రతి ఒక్కరు.

    English summary
    telugu tv anchor padeep machiraju apologises for his controversial comments on andhrapradesh capital. he released a video on the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X