Pradeep Machiraju: పెళ్లి పై యాంకర్‌ ప్రదీప్‌ క్లారిటీ.. ఆ వార్తలు నిజమేనా?

Pradeep Machiraju: బుల్లితెరపై తనదైన టైమింగ్‌, ఫన్‌, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలితో ప్రదీప్ పెళ్లి జరగబోతుందన్న ప్రచారం,త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే మాటమంతి కూడా పూర్తయ్యిందన్న కథనాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై ప్రదీప్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజు.. పలు రియాల్టీ షోలు, డ్యాన్స్‌, కామెడీ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తన ఎనర్జీ, హ్యూమర్‌తో ప్రేక్షకుల మనసు గెలిచారు. యాంకరింగ్‌తోనే కాకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టిన ప్రదీప్, హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించి మెప్పించారు.

Pradeep Machiraju Breaks Silence on Marriage Rumours with Politician Clears the Air

అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. దీంతో మళ్లీ తనకు బాగా తెలిసిన యాంకరింగ్ వైపు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ ఎప్పటిలానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో కూడా ప్రదీప్ పెళ్లి గురించి పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఓసారి రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకురాలితో వివాహమని కథనాలు హల్‌చల్ చేశాయి. ఈ విషయాలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ ఆసక్తికరంగా స్పందించారు.

'నా పెళ్లి గురించి వచ్చిన వార్తలు నేను కూడా విన్నాను. ముందు రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు రాజకీయ నాయకురాలంటున్నారు. ఇంకొద్ది రోజుల్లో క్రికెటర్‌తో అంటారేమో' అంటూ నవ్వుతూ స్పందించారు. ఈ ప్రచారాలన్నీ సరదాగా పుట్టుకొచ్చిన గుసగుసలేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

పెళ్లిపై తన ఆలోచనలను వెల్లడించిన ప్రదీప్, 'ప్రస్తుతం పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. జీవితంలో సెటిల్ కావాలని అనుకుంటున్నాను. నాకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయి. ముందుగా వాటిని సాధించాలనే నిర్ణయంతో ఉన్నాను. అవి కొంచెం ఆలస్యం అయిన మాట నిజమే. కానీ ప్రతి విషయం సరైన సమయానికే జరుగుతుందని నమ్ముతాను'అన్నారు.

రాజకీయ నాయకురాలితో రిలేషన్‌షిప్ ఉందన్న వార్తలను ఖండిస్తూ, "నాకు అలాంటి సంబంధం ఏమాత్రం లేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లికి సంబంధించిన నిజమైన విషయం ఏదైనా ఉంటే, నేనే స్వయంగా అభిమానులతో పంచుకుంటాను. అప్పటివరకు నా పెళ్లి గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అంటూ స్పష్టంగా చెప్పారు.

ఇలా ప్రదీప్ పెళ్లిపై నెట్టింట వైరల్ అవుతున్న కథనాలకు పూర్తి విరామం ఇస్తూ ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభిమానులు కూడా 'సరైన సమయానికే అన్నీ జరుగుతాయి' అంటూ ప్రదీప్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు.. ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X