‘సమంత జీవితాన్ని అలా బయటపెట్టా... జీవితంలో ఆ మాటలు మరిచిపోను’

అబ్బాయిలు కూడా యాంకరింగ్ ఇరగదీయగలరని నిరూపించి తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో పాటు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రదీప్‌ని చూసి పలువురు కుర్రాళ్లు యాంకరింగ్‌ వైపు వస్తూ సత్తా చాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం యాంకర్ సుమ కనకాలతో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదీప్ పాల్గొన్నారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో సందర్భంగా ఒక్కో యాక్టర్ గురించి సుమ అడగ్గా.. ప్రదీప్ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సమంత గురించి మాట్లాడుతూ ప్రదీప్ ఎమోషనల్ అయ్యారు. అత్తారింటికి దారేదిలో సమంత గారి ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్ చేయమని త్రివిక్రమ్ గారు పిలిచారు. షూటింగ్ రోజున ఫస్ట్ డే .. ఫస్టే డే షాట్‌లో నా ఎదురుగా కళ్యాణ్‌గారు, నా పక్కన సమంత గారు. అసలు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు. నాన్న వచ్చావా? అని త్రివిక్రమ్ గారు అడిగారు. నేను మాట్లాడటం త్రివిక్రమ్ గారికి బాగా ఇష్టం. ఎలా మాట్లాడతావు అలా? లోడ లోడ మాట్లాడతావు కదా ఒకసారి మాట్లాడు అని అడిగారు.

Pradeep Machiraju Gets Emotional About Samantha Reveals How She Changed His Career

జులాయి షూటింగ్ పూర్తయిన తర్వాత నా నెక్ట్స్ సినిమాలో మీరు ఉన్నారని త్రివిక్రమ్ గారు చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఉన్నామంటేనే ఇక చాలు అనుకున్నా. అత్తారింటికి దారేది షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ 7 గంటల కల్లా వచ్చేయండి అని చెప్పారు. నేను ఏ డ్రెస్‌లో ఉన్నానో అలాగే షూటింగ్‌కి వెళ్లా. ఆ అబ్బాయికి ఒక హెడ్ ఫోన్ ఇవ్వమని త్రివిక్రమ్ గారు చెప్పారు. మీరు దానిని ఫోన్‌కి కనెక్ట్ చేయొద్దు.. వీళ్లద్దరూ మాట్లాడుకునేది వింటూ ఉండండి అని సీన్ చెప్పారు. నా ముందు పవన్ కళ్యాణ్ గారిని, నా పక్కన సమంత గారిని పెడితే చూడకుండా ఎలా ఉంటాను, కెమెరా నా ఎదురుగా ఉంది. కళ్యాణ్ గారిని చూస్తుంటే వణికిపోయా.. కానీ తలపైకి ఎత్తకూడదు.

త్రివిక్రమ్ గారు కట్ చెప్పాక.. సార్ పరిచయం చేస్తారు నువ్వు కంగారు పడొద్దని సమంత గారు చెప్పారు. కట్ చెప్పగానే త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు. నన్ను చూడగానే టీవీలో చేస్తారు కదా అని కళ్యాణ్ గారు అడిగారు. ఇక చాలు కళ్యాణ్ గారి మనసులో స్థానం సంపాదించేశా. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారితో నేనున్నప్పుడు త్రివిక్రమ్ గారు ఫోటో తీశారు. పవన్ కళ్యాణ్ గారు నా భుజాలు నొక్కుతుంటే ఆయన ఫోన్ తీసి ఫోటో తీశారు.

సమంత గారితో నాది ఎమోషనల్ బాండింగ్. నేను సొంతంగా ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ ఎపిసోడ్‌కి సమంత గారు రావాలి. ఆవిడ రాలేక సెకండ్ ఎపిసోడ్‌కి వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ కాజల్ గారు వచ్చారు.. ఆ ప్రోమో సమంత గారు చూసి చాలా బాగుంది ప్రదీప్, నేనింతగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను వెంటనే వస్తాను రేపు షూటింగ్ చేద్దామన్నారు. సమంత గారు నా షోకి వచ్చినప్పుడు కూడా షో మొత్తం కూర్చొనే ఉన్నారు. మంచినీళ్లు చుక్క కూడా ముట్టుకోలేదు. ఇది నీ ప్రొడక్షన్ అని నాకు తెలుసు.. ఫుడ్ వద్దు, స్టాఫ్ వద్దు, మేకప్ వద్దు నేను రెడీ అయి వస్తాను సోఫాలో కూర్చొంటాను. ఎంతసేపు షూట్ చేస్తావో చేసుకోమ్మని చెప్పారు. రెండు ఎపిసోడ్స్ వస్తే అలాగే కట్ చేసుకో అన్నారు.

ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్‌ఎఫ్‌సీలో సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్‌లో పాల్గొని నేరుగా నా షోకి వచ్చి నాలుగున్నర గంటల పాటు కూర్చొన్నారు. అది నా జీవితానికి, నా షోకి టర్నింగ్ పాయింట్. నీ షోకి వచ్చిన కారణంగా నా జీవిత చరిత్ర మొత్తం జనాలందరికీ తెలిసి అందరూ మాట్లాడుకుంటున్నారు అని సమంత నాతో ఒక సంవత్సరం పాటు చెప్పారు. ఆ మాటలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో ట్రెండ్ అవుతుండగా సమంత మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X