హైపర్ ఆదిపై చేయి చేసుకున్న ప్రముఖ యాంకర్.. అందరి ముందే అలా జరగడంతో!
హైపర్ ఆది.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్.. చాలా షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో హైపర్ ఆదికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ యాంకర్ అతడిపై చేయి చేసుకోవడం హైలైట్ అవుతోంది. ఆ వివరాలు మీ కోసం!

జబర్ధస్త్ షో మొత్తంలో స్పెషల్
డబ్‌స్మాష్ వీడియోల ద్వారా హైపర్ ఆది ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి.. అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి స్కిట్లతో పాపులర్ అయ్యాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫన్నీ స్కిట్లు చేశాడు. ఇవన్నీ తన పంచ్‌లు, ప్రాసలతో వన్ మ్యాన్ షోలుగా మార్చుకుని ప్రత్యేకతను చాటుకున్నాడు.

సినిమాల్లోనూ సత్తా చాటే ఆది
కమెడియన్‌గా పరిచయం అయిన అనతి కాలంలోనే ఫేమస్ అయిన ఆదికి సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌లో నటించాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా తనలోని విద్యలు అన్నింటినీ అతడు బయట పెట్టాడు.

జబర్ధస్త్ బైబై.. ఆ రెండు షోలు
సుదీర్ఘ కాలంగా హైపర్ ఆది బుల్లితెరపై తనదైన శైలి కామెడీతో సందడి చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడు జబర్ధస్త్ షోను మరింత రేంజ్‌కు తీసుకు వెళ్లాడు. అయితే, ఇప్పుడు అతడు ఆ షోకు బ్రేక్ ఇచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో అతడు జబర్ధస్త్ నుంచి తప్పుకున్నాడు. అయితే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

వచ్చే ఎపిసోడ్ మరింత ఫన్‌గా
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. ఇక, ఈ షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ వీళ్ల సందడితో మరింత ఫన్నీగా సాగబోతున్నట్లు ప్రోమోలో చూపారు.

ఢీలో ఆదికి చేదు అనుభవం
చాలా కాలంగా తెలుగులో ఫేమస్ కమెడియన్‌గా వెలుగొందుతూ వరుస ఆఫర్లతో అందుకుంటోన్న హైపర్ ఆది మరింతగా క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా 'ఢీ' షోలో పాల్గొన్నాడు. వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో అతడు తనదైన కామెడీతో అందరినీ నవ్వించాడు. కాకపోతే చివర్లో అతడికి చేదు అనుభవం ఎదురైంది.
ఆదిని కొట్టిన యాంకర్ ప్రదీప్
'ఢీ' షోలో భాగంగా హైపర్ ఆది, సీరియల్ హీరో రవికృష్ణ కాలేజ్‌లో సీనియర్ బాయ్స్‌గా నటించారు. నవ్య స్వామితో పాటు మరొక లేడీ స్టూడెంట్లుగా చేశారు. అమ్మాయిలను ర్యాగింగ్ చేసే క్రమంలో ఆది తనదైన పంచులతో నవ్వించాడు. ఇది జరుగుతున్న సమయంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇచ్చి.. హైపర్ ఆది తలపై ఫన్నీగానే ఒక్కసారిగా కొట్టేశాడు.

అందరి ముందే అలా.. షాక్‌లో
హైపర్ ఆదిని తలపై కొట్టిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. 'గట్టిగా తగిలిందా అన్నా.. మీరు ల్యాగ్ చేస్తున్నారు సార్' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. హైపర్ ఆదికి ఏం చేయాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇక, ఈ పరిణామంపై అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. కామెంట్లలో యాంకర్ ప్రదీప్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











