దీపికా పిల్లికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రదీప్.. ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గానే కాకుండా ఆయా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్ మాచిరాజు తన యాంకరింగ్ స్కిల్స్ తో స్మాల్ స్క్రీన్ పై స్టార్ గా ఎదిగారు. ఆయన యాంకరింగ్ కు, అతని షోలకు ఎంతమంది ప్రేక్షకులు అభిమానులుగా మారారు. ప్రదీప్ మాచిరాజు కు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఆయన టీవీ ప్రోగ్రామ్స్ కు మంచి రేటింగ్స్ కూడా అందుతుంటాయి. సక్సెస్ఫుల్ యాంకర్ గానూ ప్రదీప్ మాచిరాజు క్రెడిట్ సంపాదించుకున్నారు.
అయితే ప్రదీప్ మాచిరాజు అభిమానుల నుంచి ఒక ఫిర్యాదు ఎప్పటికి ఉండింది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అందరిలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న కావడం విశేషం. ఆ మధ్యలోనే ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు అది అవసరమని తేలిపోయింది. ఇప్పటికే 39 ఏళ్లకు వచ్చిన ప్రదీప్ మాచిరాజు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ అందడం లేదు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రదీప్ మాదిరాజు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపిక పిల్లి కి లవ్ ప్రపోజ్ చేశాడు. మాటల్లో తన ప్రేమను కుమ్మరించాడు. దీపిక పిల్లి కూడా ప్రదీప్ మాచిరాజు నుంచి ఆ గులాబీ పువ్వుని అందుకుని సిగ్గుపడుతుంది. ఇదంతా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరిగింది. ఫ్యామిలీ స్టార్స్ వేదికపై ప్రదీప్ మాచిరాజు దీపిక పెళ్లికి ప్రపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే అందుకు ఆమె ఎలా స్పందించింది అనేది తెలియాల్సి ఉంది.
ఏప్రిల్ 13న విడుదల కానున్న ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్లో దీపిక పిల్లి ఎలా రియాక్షన్ ఇచ్చింది అనేది తెలియనుంది. తాజాగా ఫ్యామిలీ స్టాక్స్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎప్పుడు సుడిగాలి సుదీర్ వాక్యాతగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో మళ్లీ ప్రదీప్ మాచిరాజు తో కలిసి సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇవ్వడం షోకు అందాన్ని తెచ్చిపెట్టింది. మరింత ఎనర్జిటిక్ గాను అనిపించింది. గతంలో ఢీ డాన్స్ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యామిలీ స్టార్స్ షోలో ఇద్దరు కలిసి కనిపించడం తో వారి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా కలిసి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అక్కడ జరిగిన విషయం తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











