సర్‌ప్రైజ్: బిగ్ బాస్ 2లోకి ఎంటరైన యాంకర్ ప్రదీప్, ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు!

By Bojja Kumar

Recommended Video

Pradeep Machiraju makes a Grand Entry to the Bigg House

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ మరింత రసవత్తరంగా సాగబోతోంది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎంటరయ్యాడు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ రంగంలో నెం.1 మేల్ యాంకర్‌గా తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ రాకతో అటు ప్రేక్షకుల్లోనూ ఈ రియాల్టీ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఉలిక్కిపడ్డ ఇంటి సభ్యులు

ఉలిక్కిపడ్డ ఇంటి సభ్యులు

యాంకర్ ప్రదీప్ రాకపై ఎలాంటి ప్రకటన లేకుండా.... ఒక్కసారిగా భారీ సౌండ్‌తో మిస్టర్‌పర్ఫెక్ట్ పాట ప్లే చేయడంతో ఇంటి సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ప్రదీప్ చాలా ముదురు, ఎవరికీ దొరకడు అనే విధంగా బ్యాగ్రౌండ్ సాంగ్ ఉండటం గమనార్హం.

ప్రదీప్ ఎంట్రీతో ఇంట్లో సందడి

ప్రదీప్ ఎంట్రీతో ఇంట్లో సందడి

ప్రదీప్ ఎంట్రీతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులంతా తడికి గ్రాండ్ వెల్ కం పలికారు. తేజస్వి అతడు అడుగు పెట్టగానే నెక్ట్స్ వీక్ పంపించేద్దాం అంటూ సరదా కామెంట్స్ చేయడం గమనార్హం.

ఇంత వైల్డ్‌గా ఉంటుందనుకోలేదు

ఇంత వైల్డ్‌గా ఉంటుందనుకోలేదు

వైల్డ్ కార్డ్ అంటే ఎవరో ఒకరు వస్తారనుకున్నాం కానీ... ఇంత వైల్డ్ గా ఉంటుందని అనుకోలేదని ఇంటి సభ్యులు అభిప్రాయ పడ్డారు. వీలైనంత ఇప్పుడే నవ్వుకుందాం... మున్ముందు మనం నవ్వుకునే పరిస్థితి ఉండదు, కొట్టుకోవడమే ఉంటుంది అంటూ ప్రదీప్ ను ఉద్దేశించి గీతా మాధురి వ్యాఖ్యానించారు.

ఇక నీకు పెళ్లి కష్టమే

ప్రదీప్ ఇంట్రీ ఇవ్వగానే కొందరు ఇంటి సభ్యులు అతడి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మీకు పెళ్లి సంబంధాలు ఏమైనా కుదిరాయా? అంటూ ప్రశ్నించారు. దీనికి తేజస్వి రియాక్ట్ అవుతూ.... ఈ షోలోకి వచ్చిన తర్వాత నీకు పెళ్లవ్వడం కష్టమే, లైట్ తీసుకోంటూ పంచ్ వేసింది.

ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు

ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు

ఇంటి సభ్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టిన ప్రదీప్... ‘నేను మీవాన్ని, మీలాగే ఒకడిని కాబట్టి మీదాకా వచ్చే ముందు వట్టి చేతులతో రాదలుచుకోలేదు అంటూ వారికి ఏదో విషయం చెప్పాడు. అతడు ఏం చెప్పాడో తెలియదు కానీ అంతా ఎమోషనల్ అయ్యారు. ఏడ్చేశారు. బహుషా ప్రదీప్ ఈ షోకు వచ్చే ముందు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల నుండి సందేశాలు మోసుకొచ్చినట్లు తెలుస్తోంది. అతడు చెప్పిన విశేషాలు ఏమిటో తెలియాలంటే గురువారం రాత్రి ప్రసారం అయ్యే షో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X