twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రదీప్ రీ ఎంట్రీ.. వచ్చీ రాగానే సుడిగాలి సుధీర్‌కి చుక్కలు!!

    |

    బుల్లితెరపై యాంకర్‌గా భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రదీప్. తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ పవర్ పంచ్ డైలాగ్స్ వదిలే ఆయన అనతికాలంలోనే ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా అల్టిమేట్ డ్యాన్సులతో ఉర్రూతలూగించే 'ఢీ' ప్రోగ్రాంలో ప్రదీప్ హంగామానే వేరు. అయితే కొంతకాలంగా ఢీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌లో ప్రదీప్ కనిపించక పోవడం, ఇప్పుడు సడెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

    ప్రదీప్ యాంకరింగ్.. చర్చనీయాంశంగా ఇష్యూ

    ప్రదీప్ యాంకరింగ్.. చర్చనీయాంశంగా ఇష్యూ

    బుల్లితెరపై ప్రత్యేకమైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న ప్రదీప్.. ఈ సారి ప్రారంభమైన ఢీ ఛాంపియన్స్ కార్యక్రమంలో పాల్గొనలేదు. అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు ఆయన ఈ షోకి దూరమయినట్లు తెలిసింది. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి పలు వార్తలు కూడా వెలువడ్డాయి.

    Recommended Video

    #CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
    అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రదీప్

    అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రదీప్

    అయితే ఇదే సమయంలో ప్రదీప్ మరో ఛానల్‌లో ప్రసారమైన ఓ షోలో పాల్గొనడం చూసి ఇక ఆయన 'ఢీ'కి గుడ్ బై చెప్పినట్లే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తాజా ప్రోమోలో 'ఢీ'లో కనిపించాడు ప్రదీప్. దీంతో ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది.

    ప్రదీప్, హైపర్ ఆది గ్రాండ్‌ ఎంట్రీ

    ప్రదీప్, హైపర్ ఆది గ్రాండ్‌ ఎంట్రీ

    ఆ ప్రోమో ప్రకారం చూస్తే యాంకర్ రవి స్థానంలో హైపర్ ఆది ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రసారమైన ఢీ ఛాంపియన్స్‌లో ప్రదీప్, హైపర్ ఆది గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలంగా ప్రదీప్ యాంకరింగ్ మిస్ అయిన బుల్లితెర ప్రేక్షకులకు ఈ రీ ఎంట్రీ మంచి జోష్ ఇచ్చింది. ఇక ఎప్పటిలాగే తనదైన స్టైల్, యాంకరింగ్‌తో ప్రదీప్ అదరగొట్టేశాడు.

    ప్రదీప్ పంచులు.. సుధీర్‌ ఉక్కిరిబిక్కిరి

    ప్రదీప్ పంచులు.. సుధీర్‌ ఉక్కిరిబిక్కిరి

    ఇక ఈ షోలోకి వచ్చీ రావడంతోనే సుడిగాలి సుధీర్‌కు పంచ్‌లతో చుక్కలు చూపించాడు ప్రదీప్. చాలా రోజుల తర్వాత ప్రదీప్ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, సుధీర్‌కు పంచ్‌లు వేయడంతో షో ఆసక్తికరంగా సాగింది. మరోవైపు హైపర్ ఆది కూడా తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో సుధీర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం తాజా షోలో బాగా హైలైట్ అయింది.

    English summary
    Anchor Pradeep Machiraju re enter into the Dhee Champions show. The first episode is veru much intresting with Pradeep punches on Sudheer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X