ఎండిపోతున్నావ్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్.. యాంకర్ ప్రదీప్‌పై నటి సెటైర్లు

తెలుగు బుల్లితెరపై యాంకర్ అంటే అమ్మాయిలదే హవా. ఏ ఛానెల్ చూసినా, ఈవెంట్స్ చూసినా అమ్మాయిలే కనిపిస్తారు. అలాంటి మహిళా రాజ్యంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. తలచుకుంటూ అబ్బాయిలు కూడా యాంకరింగ్‌లో రాణించవచ్చని రుజువు చేశాడు. తెలుగు నాట అన్ని ఛానెల్స్‌లోనూ పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన ప్రదీప్.. సినిమాలలో హీరోగానూ నటించాడు.

తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజుదే ఉంటుంది. సోషల్ మీడియాలో అతని పెళ్లిపై పలు రకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ తర్వాత అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. పలు షోలకు వచ్చిన సెలబ్రిటీలు కూడా నేరుగా ఇదే ప్రశ్న అడగటంతో నవ్వుతూ తప్పించుకున్నాడే కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు ప్రదీప్. తాజాగా ఓ టీవీ షోలో ప్రదీప్‌కు తన పెళ్లిపై మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

Pradeep Machiraju Reacts on his Marriage at Cooku With Jathiratnalu Show

స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దీనికి ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. జడ్జిలుగా అరుణ ముచ్చర్ల, కమెడియన్ అలీ, నటి శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మాలు వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రకరకాల థీమ్స్, వెరైటీ వంటకాలతో జడ్జిలు ఇస్తున్న టాస్క్‌లు.. టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పడుతున్న పాట్లు, వారి అల్లరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అల్లరిని చూస్తే..

ఈ హాట్ సమ్మర్‌లో మిమ్మల్ని కూల్‌గా చూసుకోవడానికి ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. అలాగే మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవడానికి మా కుకు విత్ జాతిరత్నాలు షో ఉందని ప్రదీప్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. రాకేష్ గారు.. అందరినీ దగ్గరుండి సమ్మర్ క్యాంప్‌కి తీసుకొచ్చారు మీరు అంటాడు ప్రదీప్. ఒక వీధిలో ఒక అంకుల్ ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకెళ్లి పార్క్‌లో ఆడిస్తారు. అలా ఆ ఇద్దరు అమ్మాయల్ని పార్క్‌కి తీసుకెళ్లి ఆడించేవాడిలా ఉన్నాడని సెఫ్ సంజయ్ తుమ్మా పంచ్ విసరడంతో రాకేష్ షాక్ అవుతాడు.

ఆ వెంటనే రౌడీ రోహిణి బామ్మ క్యారెక్టర్‌లో సందడి చేసింది. నిఖిల్‌ని ఎత్తుకుని హడావుడి చేస్తుంది. ప్రదీప్‌ని చూస్తూ.. అబ్బాయి మరిచిపోయాను పెళ్లెప్పుడు అని అడుగుతుంది. నాదా నాయనమ్మా.. వచ్చే ఎండలకి అని చెబుతాడు ప్రదీప్. ఎప్పుడు ఎండలకి చేసుకుంటావు? ఎండిపోతున్నావని రోహిణి కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. ఇక జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అయితే చిరంజీవి పాత హుక్ స్టెప్స్‌తో డ్యాన్స్ చేస్తూ నడుం పట్టేసి ఇబ్బందిపడతాడు. నేను ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ని అంటూ రాకేష్‌తో స్టెప్స్ వేయిస్తాడు.

దీపిక రంగరాజు.. టైర్‌తో ఆడుకుంటూ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఇంత ఎండల్లో మీరు చల్లగా ఉండాలని నేను కూలింగ్ గ్లాస్ తీసుకొచ్చానని చెప్పగానే శ్రీదేవి విజయ్ కుమార్ సంతోషిస్తుంది. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన కూలింగ్ గ్లాస్ అంటూ బ్యాగ్‌లో నుంచి బయటకు తీయగానే అంతా నవ్వేస్తారు. పల్లవి గౌడను వెనుక నుంచి వచ్చి భయపెడతాడు ఎక్స్‌ప్రెస్ హరి. సూపర్ సినిమాలో అలీ వేసుకొచ్చిన పెయింటర్ గెటప్‌లో వచ్చి.. మీరు అలీ, నేను గోలి అంటాడు. లాస్ట్‌లో సుహాసినీ హిందీ టీచర్‌గా వచ్చి నవ్విస్తుంది. మరి ఈ సెలబ్రిటీల ఆటా పాటా చూడాలంటే మే 30, 31 తేదీలలో ప్రసారమయ్యే కుకు విత్ జాతిరత్నాలు ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read more about: pradeep machiraju rohini reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X