యాంకర్ ప్రదీప్ రెమ్యూనరేషన్ లీక్: ఆ హీరోలతో సమానంగా.. సినిమాకు అంత.. షోలకు ఇంత!

గ్లామర్ ప్రపంచంలో టాలెంట్ లేకపోతే నెగ్గుకు రావడం చాలా కష్టం.. అందునా అందమైన అమ్మాయిలు ప్రభావం చూపించే యాంకరింగ్ ఫీల్డ్‌లో ఇది మరింత కష్టం. అలాంటిది దాదాపు పదేళ్లుగా తనదైన శైలి యాంకరింగ్‌తో నెంబర్ వన్ హోస్టుగా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. సుదీర్ఘమైన కెరీర్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోన్న అతడు.. ఇటీవలే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ మాచిరాజు రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. సినిమాకు ఎంత? షోలకు ఎంత? తీసుకుంటున్నాడో తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

రేడియో నుంచి టీవీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు

రేడియో నుంచి టీవీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు


రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్ మాచిరాజు. దాని ద్వారా చాలా మందికి సుపరిచితుడు అయిన అతడు.. ఆ తర్వాత యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా షోలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తద్వారా నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు.

30 రోజుల్లో ప్రేమ అంటూ వచ్చిన ప్రదీప్

30 రోజుల్లో ప్రేమ అంటూ వచ్చిన ప్రదీప్

తనదైన శైలి యాంకరింగ్‌తో తెలుగు బుల్లితెరపై టాప్ హోస్ట్‌గా వెలుగొందుతున్నాడు యాంకర్ ప్రదీప్. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మున్నా తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ సంగీతం అందించాడు.

ఆ పాట వల్లే భారీగా జరిగిన ప్రీ బిజినెస్

ఆ పాట వల్లే భారీగా జరిగిన ప్రీ బిజినెస్

షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 'నీలి నీలి ఆకాశం' అనే పాట విడుదలై రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

ప్రదీప్ ఫిదా చేశాడు.. టాక్ మాత్రం అలా

ప్రదీప్ ఫిదా చేశాడు.. టాక్ మాత్రం అలా

ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. కానీ, హీరోగా మొదటి సినిమా చేసిన ప్రదీప్ నటనపై మాత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు విభిన్నమైన పాత్రల్లో అతడు ఒదిగిపోయి నటించాడని సినిమాను చూసిన ప్రేక్షకులంతా చెబుతున్నారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నాలుగు రోజుల్లోనే

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నాలుగు రోజుల్లోనే

యాంకర్ ప్రదీప్‌ మొదటి సినిమా కావడంతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, మొదటి రోజే ఊహించని విధంగా రూ. 1.69 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసేసింది.

సినిమాకు ప్రదీప్ రెమ్యూనరేషన్ లీక్

సినిమాకు ప్రదీప్ రెమ్యూనరేషన్ లీక్

మొదటి సినిమా కావడంతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు ప్రదీప్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం అతడు కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నాడట. హిట్ అయితే తర్వాత చూద్దాం అన్నట్లు మాట్లాడుకున్నారని తెలిసింది.

ఆ హీరోలతో సమానంగా.. షోలకు ఇంత!

ఆ హీరోలతో సమానంగా.. షోలకు ఇంత!

ఇక షోల పరంగా చూసుకుంటే ప్రదీప్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాడట. అన్ని షోలతో కలిపి మొత్తంగా నెలకు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నాడని సమాచారం. ఇలా ఒక్క ఏడాది రూ. ఆరు కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని అంటున్నారు. టాలీవుడ్ టైర్ టూ హీరోలు తీసుకునే అంత షోల ద్వారానే అందుకుంటున్నాడు ప్రదీప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X