ప్రదీప్ మాచిరాజు షాకింగ్ రెమ్యునరేషన్ .. ఆ హీరోలతో సమానంగా, సినిమాకు ఓ రేటు .. షోలకు సపరేట్!
తెలుగు బుల్లితెరపై యాంకర్లు అంటే అమ్మాయిలే. సుమ, ఉదయభాను, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారు స్టార్ యాంకర్లుగా వెలుగొందారు. సుమ అయితే దాదాపు 20 ఏళ్లకు పైగా స్టార్ యాంకర్‌గా బుల్లితెరను ఏలుతున్నారు. ఎంతోమంది కొత్త అమ్మాయిలు వస్తున్నారు.. వెళ్తున్నారు కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్. అలాంటి ఫిమేల్ యాంకర్ల రాజ్యంలో అడుగుపెట్టి వారికే పోటీ ఇచ్చే రేంజ్‌కి వచ్చాడు ప్రదీప్ మాచిరాజు. మనోడిని స్పూర్తిగా తీసుకుని మరింత మంది కుర్రాళ్లు యాంకరింగ్ వైపు వచ్చారు.
గ్లామర్ ప్రపంచంలో ఒక్క టాలెంట్ ఉంటే చాలదు .. అందులోనూ అందమైన అమ్మాయిలు ప్రభావం చూపించే యాంకరింగ్ ఫీల్డ్‌లో ఇది చాలా టఫ్ . అలాంటిది దాదాపు 15 ఏళ్లుగా తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. యాంకరింగ్‌లో తనకు తిరుగులేదని నిరూపించిన అతను పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. కొద్దిరోజుల క్రితం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో హీరోగానూ ఎంట్రీ ఇచ్చి అలరించాడు.

బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రదీప్ మాచిరాజు.. పెళ్లెప్పుడు చేసుకుంటాడని అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. ఆయన పాల్గొనే షోలలో కంటెస్టెంట్స్ కూడా ఆయన బ్యాచిలర్ లైఫ్, పెళ్లిపై సెటైర్లు వేస్తుంటాడు. వాటన్నింటికి నవ్వుతూ ఉండటమే తప్పించి ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు ప్రదీప్ మాచిరాజు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా తర్వాత తిరిగి యాంకరింగ్‌లో బిజీ అయిన ఆయన రీసెంట్‌గా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన మరో యాంకర్ దీపికా పిల్లి నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అనే దానిపై డిస్కషన్స్ జరుగుతుంటాయి. సినిమాకు ఎంత? షోలకు ఎంత? తీసుకుంటున్నాడో ఆ వివరాలు మీకోసం!
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా కోసం ప్రదీప్ రూ. 30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. రీసెంట్ మూవీ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కోసం ప్రదీప్ రూ. 50 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక షోల విషయానికి వస్తే ప్రదీప్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని బుల్లితెర వర్గాలు టాక్.
ఇలా అన్ని ఛానెల్స్‌లో షోలు, సినిమా ఈవెంట్లు కలిపి మొత్తంగా నెలకు రూ.60 లక్షల నుంచి రూ. కోటి వరకు ప్రదీప్ చార్జ్ చేస్తున్నాడని సమాచారం. ఇలా ఒక్క ఏడాదిలోనే రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని అంటుంటారు. అంటే టాలీవుడ్‌లో టైర్ టూ హీరోలు అందుకునే పారితోషికాన్ని మించి తన షోల ద్వారానే రాబడుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తాజాగా నటిస్తున్న సినిమా కూడా హిట్ అయితే ప్రదీప్ రేంజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











