twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhee show: ఆ కారణంగా యాంకర్ ప్రదీప్ గుడ్ బై.. నెంబర్ వన్ షోకు మరో దెబ్బ?

    |

    యాంకర్ గా తెలుగు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఫీమేల్ యాంకర్స్ లో సుమ నెంబర్ వన్ కాగా అలాగే మేల్ యాంకర్స్ లో ప్రదీప్ టాప్ లో ఉంటాడు అని చెప్పవచ్చు. అయితే అతను ఇటీవల ఢీ షో నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రియల్టీ షోలను కొంతకాలం పాటు దూరం పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉందట. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదట అలా సినిమాలో..

    మొదట అలా సినిమాలో..

    యాంకర్ ప్రదీప్ అంటే.. తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు. అతను ఈ పొజిషన్ కు రావడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు అనే చెప్పాలి. మొదట ప్రదీప్ రేడియో జాకీగా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక. తరువాత అతను వరుడు సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గ్యాంగ్ ఒకరిగా కనిపించాడు. అలా కొన్ని సినిమాల్లో మంచి నటుడిగా కొనసాగుతూ వచ్చాడు.

    బన్నీతో స్నేహం

    బన్నీతో స్నేహం

    ఒకానొక సమయంలో అతను అల్లు అర్జున్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. బన్నీతో నిత్యం కొన్ని పార్టీల్లో కూడా పాల్గొనేవాడు. ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు ఏమైందో ఏమో కాని బన్నీతో ప్రదీప్ ఎక్కువగా కనిపించలేదు. ఇక అప్పుడు సినిమాలకు దూరమైన ప్రదీప్ టెలివిజన్ రంగంలో బిజీ అయ్యాడు.

    టాప్ యాంకర్ గా

    టాప్ యాంకర్ గా

    ఇక యాంకర్ గా అతను కెరీర్ స్టార్ట్ చేసిన అనంతరం ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన షోలన్ని కూడా సరదాగా చేసుకుంటూ వెళుతూ మంచి క్రేజ్ అందుకున్నాడు. యాంకర్ ప్రదీప్ ఉన్నాడు అంటే అందులో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈటీవీ రియలీటి షోలకు వచ్చిన తరువాత అతని క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

     ఢీ షోకు గుడ్ బై?

    ఢీ షోకు గుడ్ బై?

    ఇక ప్రదీప్ కు ఎక్కువగా క్రేజ్ అందించిన రియాలిటీ షోలలో ఢీ షో ఒకటి. అందులో అతను మిగతా మిగతా వారిపై వేసే సెటైర్స్ అలాగే కామెడీ పంచ్ లతో విభిన్నంగా ఆకట్టుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు అత్యధిక ఆదాయం అందుకుంటున్న ఆ ఢీ షో నుంచి ప్రదీప్ మాచిరాజు తప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

    ఆ కారణంతోనే దూరం?

    ఆ కారణంతోనే దూరం?

    ప్రదీప్ ఆ మధ్య హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో మంచి సినిమాలో హీరోగా ఆఫర్ రావడంతో ఢీ షోను ప్రస్తుతం చేయలేనని నిర్వాహకులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సుడిగాలి సుధీర్ లేకపోవడంతో ఆ షోపై కాస్త దెబ్బ పడింది. ఇక ఇప్పుడు ప్రదీప్ కూడా దురమైతే మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అయిన అనంతరం ప్రదీప్ కు అయితే మూవీ ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. కానీ అతను మాత్రం టెంప్ట్ అవ్వకుండా మంచి కాన్సెప్ట్ తో రావాలని చూస్తున్నాడు.

    English summary
    pradeep machiraju shocking decision on dhee show anchoring
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X