»   » యాంకర్ ప్రదీప్ ‘పెళ్లిచూపులు’ నాన్సెన్స్.. షో అంతా ఫేక్.. ఆపేస్తే సరి!

యాంకర్ ప్రదీప్ ‘పెళ్లిచూపులు’ నాన్సెన్స్.. షో అంతా ఫేక్.. ఆపేస్తే సరి!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    యాంకర్ ప్రదీప్ మాచిరాజు వరుడిగా మారేందుకు చేపట్టిన టెలివిజన్ స్వయంవరం పెళ్లిచూపులు సీరియల్‌పై ప్రేక్షకులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఔత్సాహిక పెళ్లికూతుళ్లపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంపై భారీ ఎత్తున్న సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నది. ఈ కార్యక్రమం ముగిసినా ప్రదీప్ ఎవరినీ పెళ్లి చేసుకునే అవకాశం కనపించడం లేదు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే ప్రదీప్ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొన్నాడనే వాదన బలంగా వినిపిస్తున్నది.

    గతంలో రాఖీ చేదు అనుభవం

    గతంలో రాఖీ చేదు అనుభవం

    టెలివిజన్‌లో స్వయంవరం రియాలిటీ షోలు గతంలో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రాఖీ సావంత్ విషయంలో గానీ, రాహుల్ మహాజన్ విషయంలో గానీ వర్కవుట్ కాలేదు. స్వయంవరం కార్యక్రమం ద్వారా పెళ్లి చేసుకొన్న రాఖీ, రాహుల్ తొందర్లోనే దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పిన దాఖలాలు ఉన్నాయి.

    హీరో ఆర్యకు కూడా వర్కవుట్ కాలేక

    హీరో ఆర్యకు కూడా వర్కవుట్ కాలేక

    తమిళ నటుడు ఆర్య కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టి విఫలమయ్యాడు. స్వయంవరం ప్రకటించినా ఎవరినీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆ కార్యక్రమం వృధా ప్రయాసగా మారింది.

    దారుణంగా నెటిజన్ల ట్రోల్

    దారుణంగా నెటిజన్ల ట్రోల్

    ఇవన్నీ తెలిసినా యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సుమ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నది. ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోలేక దారుణంగా ముగిసే దిశగా సూచనలు కనపడుతున్నాయి. ఈ కార్యక్రమంపై దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

    పెళ్లి చూపులు షో నాన్సెన్స్

    పెళ్లిచూపులు ప్రొగ్రాం చాలా విసుగుపుట్టించేలా ఉంది. దీనికి బదులు తెలుగు వెర్షన్‌లో ఖత్రోంకా కిలాడీ లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుండు. ఇదంతా నాన్సెన్స్. గతంలో ప్రదీప్ ఇంతకంటే మంచి షోలు నిర్వహించాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

    యాంకర్ ప్రదీప్ షోపై సెటైర్లు

    క్యూట్ లిటిల్ బాయ్ ప్రదీప్.. పెళ్లిచూపుల షో ద్వారా మస్తుగా వినోదాన్ని అందిస్తున్నావు. నీ ఫన్ ఎలా ఉందో నువ్వే చూడు అంటూ ఓ మెమోను పోస్ట్ చేశారు.

    ప్రదీప్ షో అంతా ఫేక్ మాదిరిగా

    పెళ్లిచూపులు ఇంత చెత్తగా ఉందే. ప్రదీప్ మాచిరాజు ఎక్కడా లేని హైప్ ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తూంటే తప్పుడు సంకేతాలు అందినట్టు కనిపిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఔత్సాహిక పెళ్లి కూతుళ్లు అంతా ఫేక్, డబ్బులిచ్చి తెచ్చినట్టు అనిపిస్తున్నది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    English summary
    Pradeep Machiraju is readying for marriage through the brand new Television show Pelli Choopulu. Netizens have expressed their anger against anchor Pradeep Machiraju and Star Maa for their commercial attitude.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more