కోర్టుకు యాంకర్ ప్రదీప్‌.. షాకిచ్చిన పోలీసులు

By Rajababu

Recommended Video

కోర్టుకు యాంకర్ ప్రదీప్‌.. షాకిచ్చిన పోలీసులు !

డ్రంక్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ప్రదీప్ కంటికి కనిపించకుండా పోయారు.

ప్రదీప్‌కు నోటీసులు

ప్రదీప్‌కు నోటీసులు

అనేక మీడియా కథనాల మధ్య డ్రంక్ డ్రైవ్ వ్యవహారంలో ప్రదీప్ సోమవారం (జనవరి 8 తేదీన) పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా ప్రదీప్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

కోర్టు ముందుకు యాంకర్ ప్రదీప్

కోర్టు ముందుకు యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రదీప్‌ను జనవరి 10న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘటన కేసు, వాహనానికి బ్లాక్ ఫిల్మ్ వ్యవహారంలో ప్రదీప్‌ను కోర్టు విచారించే అవకాశం ఉంది.

ప్రదీప్ వాహనం సీజ్

ప్రదీప్ వాహనం సీజ్

డిసెంబర్ 31వ తేదీన ప్రదీప్‌ పట్టుబడిన సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనాన్ని ట్రాఫిక్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కోర్టుకు నివేదిక

కోర్టుకు నివేదిక

ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వివరాలను, బ్రీత్ అనలైజర్ పరీక్షలో వెల్లడైన పాయింట్లు, కౌన్సెలింగ్ జరిగిన తీరుపై నివేదికను ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.

ప్రదీప్ జైలుశిక్షతోపాటు

ప్రదీప్ జైలుశిక్షతోపాటు

డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తే.. యాంకర్ ప్రదీప్‌కు జైలుశిక్ష విధించే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే ప్రమాదం ఉండటానికి ఆస్కారం ఉంటుంది.

మద్యం సేవించి వాహనం

మద్యం సేవించి వాహనం

సోమవారం జరిగిన కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం తప్పే. డ్రంక్ డ్రైవ్‌ వల్ల జరిగే అనర్థాలపై తాను ప్రచారం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X