ఇంకో కొత్త సినిమా ఈ రోజు 'జెమినీ'లో

By Srikanya

హైదరాబాద్ : డౌన్ లోడ్స్, ఆన్ లైన్ సినిమాలు, టోరెంట్స్ పెరిగిపోవటంతో... ఇంతకు ముందులా రిలీజైన చాలా కాలానికి గానీ టీవిల్లో ప్రదర్శించటం అనే పద్దతికి నిర్మాతలు, చీవీ ఛానెల్స్ బై చెప్పేసాయి. సినిమా విడుదలయిన నాలుగైదు నెలల లేపే చిత్రం ఏదో ఒక ఛానెల్ లో వచ్చేస్తోంది. అదే కోవలో రీసెంట్ గా విడుదలదైన ‘ఉలవచారు బిర్యాని' ..జెమినీ టీవిలో ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు వేస్తున్నారు.

‘ఉలవచారు బిర్యాని' చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్' కు రిమేక్. ఈ సినిమాలో స్నేహ మరియు ఊర్వశినటిస్తున్నారు . ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది.

Prakash Raj's Ulavacharu Biryani on small screen today

మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. మళయాళంలో వచ్చిన ‘సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించిన ఈ "ఉలవచారు బిర్యానీ" కి ‘ లవ్ ఈజ్ కుకింగ్ ‘ అన్న ట్యాగ్ లైన్ తగిలించారు.

చిత్రం కథేమిటంటే... పురావస్తు శాఖలో పనిచేసే కాళిదాసు(ప్రకాష్ రాజ్) భోజన ప్రియుడు...క్రానిక్ బ్యాచులర్. మరో ప్రక్క గౌరీ(స్నేహ) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతకంలో ఉన్న దోషంతో పెళ్లి కాక మిగిలిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోనివిధంగా..విధి వశాత్తు ఫోన్ లో గొడవ పడతారు. అయితే తర్వాత తాము పొరపాటు పడ్డామని,రాంగ్ నెంబర్ అని తెలుసుకుని సారీ చెప్పుకుంటారు. అలా మొదలైన వీరి ఫోన్ స్నేహం... పెరిగి ఓ ఫైన్ డే కలవాలనే నిర్ణయానికి వస్తారు. అయితే తమ వయస్సులు గురించి ఆలోచించిన కాళిదాసు,గౌరీ ఒకరినొకరు కలవటానికి సంశయిస్తారు. ఆ సంసయంలో తమ అసలు ఐడెంటిటీ బయిటపెట్టకుండా... కాళి దాసు తన మేనల్లుడు నవీన్ (తేజస్)ని, గౌరీ తన సోదరి(సంయుక్త)ని పంపుతారు . అప్పుడేం జరిగింది. వీరిద్దరూ ఎలా కలిసి,ఒకటయ్యారు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఈ యువ జంట పాత్రేమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X