శ్రీముఖి ప్రేమలో ఫేమస్ యూట్యూబర్.. మస్త్ ఇష్టం అంటూ హగ్ ఇవ్వడంతో!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమదైన హోస్టింగ్‌లో అలరిస్తున్నారు. కానీ, అందులో ఒకరిద్దరు మాత్రమే వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి ఒకరు. అందానికి అందం, యాంకరింగ్‌కు యాంకరింగ్ చేస్తూ తెలుగులో ఫుల్ ఫేమస్ అయిన ఈ చిన్నది.. తెలుగులో సెన్సేషన్ అయిపోయింది. దీంతో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్రీముఖికి ఓ ఫేమస్ యూట్యూబర్ లవ్ ప్రపోజల్ చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

అలా వచ్చి.. పెద్ద స్టార్‌గా
శ్రీముఖి యాంకర్ అవడానికి ముందే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన శైలిలో మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి వచ్చి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ రంగంలో హవాను చూపిస్తూ క్యూట్ బ్యూటీ శ్రీముఖి టాప్ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది.

Prankster Kiran Macha Love Proposal To Anchor Sreemukhi In Kiraak Boys Khiladi Girls Show

ఫుల్ షోలతో యమా బిజీ

యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. ఇటీవలి 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'బీబీ జోడీ' వంటి షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. ఇక, ఇప్పుడు 'నీతోనే డ్యాన్స్ 2'తో పాటు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో సత్తా చాటుతోంది.

Prankster Kiran Macha Love Proposal To Anchor Sreemukhi In Kiraak Boys Khiladi Girls Show

కిర్రాక్ షోతో వచ్చేసింది
'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభం అయింది. ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతున్న ఈ షోను శ్రీముఖి హోస్ట్ చేయనుంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడబోతున్నారు. ఇందులో ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉన్నారు.

Prankster Kiran Macha Love Proposal To Anchor Sreemukhi In Kiraak Boys Khiladi Girls Show

కాలేజ్ థీమ్‌తో స్పెషల్

'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోను రెండు టీమ్‌ల మధ్య జరిగే పోటీతో నడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వారంలో ప్రసారం అవుతున్న ఎపిసోడ్లను కాలేజ్ థీమ్ స్పెషల్‌గా తీసుకు వచ్చారు. ఇందులో రెండు టీమ్‌లకు కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించారు. శనివారం ఎపిసోడ్ అంతా సందడిగానే సాగింది. ఆదివారం కూడా ఇదే జోరు కంటిన్యూ కాబోతుంది.

శ్రీముఖికి లవ్ ప్రపోజల్
ఎంతో సందడిగా సాగుతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో ఎవరికైనా లవ్ లెటర్లు రాయమని అబ్బాయిలకు టాస్క్ ఇచ్చారు. ఇందులో యూట్యూబర్ కిరణ్ మచ్చా తాను రాసిన లెటర్ చదువుతూ.. 'ఓయ్ పిల్లా.. వాగు వర్షాకాలంలో వచ్చి పోతుంది. కానీ నువ్వు నాకు లైఫ్ లాంగ్ వస్తనే ఉండాలే. శ్రీముఖి ఐలవ్యూ' అంటూ అందరి ముందే యాంకర్‌కు ప్రపోజ్ చేసేశాడు.

హగ్ ఇచ్చేసిన శ్రీముఖి

యూట్యూబర్ కిరణ్ మచ్చా తనకు లెటర్ రాయడంతో పాటు ఐలవ్యూ అని చెప్పగానే శ్రీముఖి షాక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా అతడు 'నిజంగానే నువ్వుంటే నాకు మస్త్ ఇష్టం' అని చెప్పాడు. ఆ వెంటనే తేరుకున్న యాంకర్ శ్రీముఖి అతడిని ఆప్యాయంగా హత్తుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X