బ్రేక్ తీసుకోవడం మాకు ఎప్పటికీ ఆప్షన్ కాదు.. యశ్‌తో ప్రశాంత్ నీల్ ముచ్చట్లు
కేజీయఫ్ సినిమా ఎన్ని సంచనాలనకు సజీవ సాక్ష్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేజీయఫ్ వెండితెరపై సృష్టించిన సునామీకి ఇండియన్ బాక్సాఫీస్ తడిసి ముద్దైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్లు కొల్లగొట్టి కన్నడ పరిశ్రమలో నవ శకాన్ని లిఖించింది. శాండల్ వుడ్‌ను దేశ స్థాయిలో నిలబెట్టిన కేజీయఫ్ తెలుగులోనూ సత్తా చాటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
కేజీయఫ్ సాధించిన విజయాలకు తగ్గట్టుగా చాఫ్టర్ 2ను కూడా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతున్నా బుల్లితెరపై మాత్రం ఇంత వరకు సందడి చేయలేదు. అయితే రీసెంట్‌గా కేజీయఫ్‌కు మోక్షం వచ్చింది. తెలుగు శాటిలైట్‌కు మంచి రేటే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆదివారం బుల్లితెరపై రాకీ భాయ్ దుమ్ములేపేందుకు సిద్దమయ్యాడు.

ఈ మేరకు మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. బ్రేక్ తీసుకోవడం మాకెప్పుడూ ఆప్షన్ కాదు.. అందుకే మీరు బ్రేక్ తీసుకునే ముందు బాగా ఆలోచించండి. తెలుగు వరల్డ్ ప్రీమిల్ స్టార్ మాలో ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కాబోతోంద'ని తెలిపాడు. ఈ ట్వీట్‌తో పాటు యశ్‌తో ముచ్చట్లు పెడుతున్న ఫోటోలను షేర్ చేశాడు.
ఆ మధ్య కేజీయఫ్ చిత్రాన్ని లోకల్ చానెల్ ప్రసారం చేయడంపై నిర్మాత ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాము ఎవ్వరికీ హక్కులు అమ్మలేదని, అలాంటప్పుడు సినిమాను ఎలా ప్రసారం చేస్తారని సదరులోకల్ చానెల్‌పై కేసు నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications











