బాయ్‌ఫ్రెండుపై టీవీ నటి ఫిర్యాదు

ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఓషివరా పోలీసులను ఆశ్రయించింది. మల్హోత్రా తన పట్ల, తన తండ్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రత్యూష ఆరోపిస్తోంది. అయితే మక్రంద్ మల్హోత్రా వాదన మరోలా ఉంది. తాను అలా ప్రవర్తించలేదని...ప్రత్యూష మరొకరితో డేటింగ్ చేస్తోందని, అందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వెల్లడించారు.
అయితే పోలీసులు ప్రత్యూష బెనర్జీ నుండి ఫిర్యాదు అందుకున్న తర్వాత మల్హోత్రా మీద ఐపిసి సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసారు. మరో వైపు మక్రంద్ మల్హోత్రా ఫిర్యాదు మేరకు ప్రత్యూష బెనర్జీపై కూడా ఇదే సెక్షన్‌పై కేసు నమోదు చేసారు. ఎవరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, వారిద్దరు కోర్టులో తేల్చుకుంటారని పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











