టివి నటి సూసైడ్ సంచలనం.. సలోనితో పెళ్ళికి రెడీ అవుతున్న బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్!

రెండేళ్ల క్రితం టివి నటి ప్రత్యుషా బనెర్జీ సూసైడ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనేక విషాద ప్రేమ గాధలలాగే ప్రత్యుష జీవితం కూడా విషాదంగా ముగిసింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రత్యుష తల్లిదండ్రులు ఈ కేసులో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అతడిపై కేసుకు కూడా నమోదైంది. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై కేసు కొట్టివేలాయని ఇటీవల రాహుల్ రాజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. తన మరో స్నేహితురాలు, టివి నటి అయిన సలోనిని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు.

సంచలనం సృష్టించిన సూసైడ్

సంచలనం సృష్టించిన సూసైడ్

ప్రత్యూష బనెర్జీ సూసైడ్ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. ప్రత్యూష బనెర్జీ, రాహుల్ రాజ్ ప్రేమలో ఉండగా ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆమె సూసైడ్ పై పలు అనునాలు ఇప్పటికి ఉన్నాయి.

మానసికంగా వేధించాడు

మానసికంగా వేధించాడు

ప్రత్యూష మరణానికి రాహుల్ రాజ్ కారణం అంటూ అప్పట్లో ఆమె బంధువులు ఆరోపించారు. రాహుల్ రాజ్ పై కేసు కూడా నమోదైంది. డబ్బు కోసం ప్రత్యూషని రాహుల్ మానసికంగా వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆమెతోనే వివాహానికి రెడీ

ఆమెతోనే వివాహానికి రెడీ

తాను తన స్నేహితురాలు సలోనిని త్వరలో వివాహం చేసుకోబోతున్నానాని రాహుల్ రాజ్ సంచలన ప్రకటన చేశాడు. ప్రత్యూష సూసైడ్ వివాదంలో సలోని పేరు కూడా ఉండడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

మోసం చేయడానికి

మోసం చేయడానికి

ప్రత్యూష కంటే ముందు నుంచే రాహుల్, సలోనికి పరిచయం ఉంది. 2011 నుంచి 2015 వరకు వీరిద్దరి స్నేహితులుగా, వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. రాహుల్ రాజ్ తో విభేదాలు ఏర్పడ్డాక ప్రత్యూష సంచలన ఆరోపణలు చేసింది. రాహుల్ రాజ్, సలోని కలసి తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రాహుల్ ని , తనని వేరుచేయడానికి ప్రత్యూషే ప్రయత్నించిందని సలోని ప్రతివాదన చేసింది.

ప్రత్యూష మరణం తరువాత

ప్రత్యూష మరణం తరువాత ఈ మాజీ ప్రేమికులు మళ్ళీ ఒక్కటయ్యారు. త్వరలో తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు రాహుల్ ఇంస్టాగ్రామ్ లో ప్రకటించాడు.

అనేక ఒడిదుడుకులు

అనేక ఒడిదుడుకులు

గత ఏడాది కాలంగా తాను అనేక ఒడిదుడులుకు ఎదుర్కొన్నానని, తన పుట్టినరోజు నుంచి తిరిగి తన జీవితం చిగురించింది రాహుల్ రాజ్ తెలిపాడు. త్వరలో తాను సలోని శర్మని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X