కార్తీక దీపం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సరికొత్త తరహాలో మళ్ళీ పార్ట్ 2.. వంటలక్క కామెంట్ తో అసలు క్లారిటీ!

టెలివిజన్ ప్రపంచంలో ఇటీవల కాలంలో కొన్ని సీరియల్స్ కు ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఒక విధంగా ఓటీటీ కంటెంట్ పెరిగిన తర్వాత సీరియల్స్ కు ఆదరణ కూడా తగ్గుతుంది అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మంచి కంటెంట్ వస్తే మాత్రం జనాలు అసలు సీరియల్స్ వదిలిపెట్టారు అని అర్థమవుతుంది.

ఇక అందుకు ఉదాహరణగా కార్తిక దీపం నిలిచింది అని చెప్పవచ్చు. ఊహించని స్థాయిలో ప్రతి ఎపిసోడ్ కు అద్భుతమైన రేటింగ్స్ అందుకుంటూ వస్తున్న కార్తిక దీపం సీక్వెల్ కూడా ఉండబోతుంది అని ఇటీవల ఒక క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ సీరియల్ గా..

నెంబర్ వన్ సీరియల్ గా..

తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి. అయితే అందులో మర్చిపోలేని కొన్ని సీరియల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అలాంటి వాటిలో కార్తీక్ దీపం ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే ఫైనల్ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఒక విధంగా హాట్ స్టార్ లో కూడా అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ లో కార్తీక దీపం నిలిచింది.

 కనెక్ట్ కావడంతో..

కనెక్ట్ కావడంతో..

అసలు సీరియల్స్ కు చాలా వరకు ఆదరణ తగ్గుతుంది అని అనుకుంటున్న తరుణంలోనే కార్తీకదీపం అంతకుమించి అనే తరహాలో రేటింగ్స్ అందుకుంటూ మళ్లీ సీరియల్స్ కు కొత్త ప్రాణం పోసింది. అసలు ఈ సీరియల్లో మొదట పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ డాక్టర్ బాబు వంటలు అక్క క్యారెక్టర్స్ కనెక్ట్ కావడంతో జనాలు మళ్ళీ వదిలిపెట్టలేదు

అద్భుతమైన రేటింగ్స్

అద్భుతమైన రేటింగ్స్

గడిచిన మూడేళ్లలో అత్యధిక స్థాయిలో TRP అందుకున్న ఏకైక సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. దాదాపు ప్రతిసారి కూడా ఈ సీరియల్స్ కు 16 నుంచి 22 మధ్యలోనే టీఆర్పి రావడం విశేషం. కొన్నిసార్లు ఆ సంఖ్య అంతకంటే ఎక్కువ కూడా పెరిగింది. ఈ సీరియల్ నిరాశపరచుకుండా కొనసాగుతూనే ఉంది. ఇక ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సీరియల్ మళ్లీ మరొక 300 ఎపిసోడ్ల వరకు కొనసాగించారు అంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంచనాలు పెంచుకుంటూ..

అంచనాలు పెంచుకుంటూ..

ఇప్పటివరకు కార్తీకదీపం 1567 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది అంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్ 2017 లో అక్టోబర్ 16న మొదలైంది. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తర్వాత నెంబర్ వన్ సీరియల్ గా తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక రేటింగ్ అందుకుంటూ వెళ్లింది. ఇక ప్రతి ఏడాది కూడా ఈ సీరియల్ పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

కార్తీకదీపం 2 కూడా..

కార్తీకదీపం 2 కూడా..

అయితే మొత్తానికి కార్తీకదీపం సీరియల్ అయితే ముగిసింది. ఫైనల్ ఎపిసోడ్ జనవరి 23వ తేదీన ప్రసారం కానుంది. అయితే ఈ ఎపిసోడ్ ముగిసిన కూడా ఏమీ బాధపడవద్దు అని చిత్ర యూనిట్ నుంచి ఒక అద్భుతమైన సమాచారం అందుతొంది. కార్తీకదీపం 2 కూడా రాబోతున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేసారు. వంటలక్క అక్క ఇటీవల ఫరెవల్ పార్టీలో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాము అని కూడా క్లారిటీ ఇవ్వడంతో కార్తిక దీపం సీక్వెల్ ఉండబోతున్నట్లు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X