Premi Viswanath New Serial: వంటలక్క వచ్చేస్తోంది మావా... గెట్ రెడీ ఫోక్స్

ప్రేమి విశ్వానాథ్.. అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. అదే వంటలక్క అనగానే చాలా మంది ఆమెనా అని గుర్తు పట్టేస్తారు. బుల్లితెరపై వంటలక్కగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది ప్రేమివిశ్వానాథ్. ఓ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది ఆమెకు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ కు కార్తీక దీపం సీరియల్ తో పరిచయమైన ప్రేమి విశ్వానాథ్.. ఆ సీరియల్ తర్వాత మళ్లీ కనబడలేదు. అయితే వంటలక్క ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. వంటలక్క మళ్లీ బుల్లితెరపై సందడి చేయబోతుందట. ఆ వివరాల్లోకి వెళితే...

కార్తీక దీపంతో ఎంట్రీ...:ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన బుల్లితెర నటి. స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ తో తెలుగు టీవిరంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఆ సీరియల్ ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ఏకంగా ఐదు సంవత్సరాలకు పైగా నడిచింది. అయినా ఈ సీరియల్ బుల్లి తెరపై సూపర్ హిట్టుగా నిలిచింది. తెలుగు ఆడియెన్స్ అందరూ ఈ సీరియల్ కోసం ఆతృతగా ఎదురుచూసేవారు.

Premi Vishwanath is coming with another serial on Star Maatv

మీమ్స్ ట్రోల్స్...:ఇక ఈ సీరియల్ దాదాపు 1568 ఎపిసోడ్స్ నడిచింది. వంటలక్కగా ప్రేమి విశ్వానాథ్ నటనకు తెలుగు ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు, పిల్లలు సైతం ఫిదా అయ్యారు. ఈ సీరియల్ కు ఏ సీరియల్ కు రానంత రేటింగ్ వచ్చేది. ఇక డాక్టర్ బాబుగా నిరూపమ్ కు కూడా బాగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ పై బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇప్పటికీ ఆ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూ ఉంటాయి. ఆ మధ్య వంటలక్క, డాక్టర్ బాబు అంటూ మీమ్స్, ట్రోల్స్ బాగా వచ్చాయి.

మళ్లీ బుల్లితెరపై...:అయితే ఈ సీరియల్ కు ఆ మధ్య ఎండ్ కార్డ్ వేశారు. సీరియల్ కు ఎండ్ కార్డ్ పడటంతో... వంటలక్క ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. ఇక ఈ సీరియల్ స్థానంలో బ్రహ్మాముడి అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈ సీరియల్ కు కూడా మంచి రేటింగ్ అయితే వస్తోంది. ఇదిలా ఉంటే.. వంటలక్క మళ్లీ బుల్లితెరపై సందడి చేయనుందట. త్వరలో ఓ మంచి ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్లు స్వయంగా తనే చెప్పుకొచ్చింది.

Premi Vishwanath is coming with another serial on Star Maatv

మా బోనాల జాతరలో:మా టీవీలో ఈ ఆదివారం మా బోనాల జాతర ఎంటర్టైన్మెంట్ షో ప్రసారం అయింది. ఈ షోలో పాల్గొన్న వంటలక్క... తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చింది. ఈ షోలో అమ్మవారిగా దర్శనం ఇచ్చిన తర్వాత యాంకర్ రవి, వర్షిణి.. వంటలక్క నెక్ట్స్ ప్రాజెక్టు గురించి అడిగారు. ఆమె త్వరలో మా టీవీలో సందడి చేయనున్నట్లు చెప్పింది. ఇక ఈషోలో పలు గేమ్స్ లో పాల్గొన్న ఆమె.. నిరూపమ్ తో కలిసి స్టేప్పులు కూడా వేసింది.

Premi Vishwanath is coming with another serial on Star Maatv

హిడెన్ ట్యాలెంట్ అదే..:ఇక యాంకర్ రవి ఫన్నీ క్వశ్చన్స్ అడిగాడు. దానికి నిరూపమ్, ప్రేమి విశ్వానాథ్ సమాధానం చెప్పారు. యాంకర్ రవి మీకు కార్తీక దీపం తర్వాత ఎవరినీ మిస్ అయ్యారు అంటే... కచ్చితంగా ప్రేమి విశ్వానాథ్ నే అని చెప్పాడు. ప్రేమి విశ్వానాద్ ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఆమె కూడా డాక్టర్ బాబునే అంటూ సమాధానం ఇచ్చింది. ఎవరికీ తెలియని ట్యాలెంట్ మీలో ఏం ఉందని రవి అడగ్గా... ఎవరికీ తెలియని టాలెంట్ అంటే నేను ఎక్కువ సేపు నిద్రపోతాను అని చెప్పంది. ఇక నిరూపమ్ ను అడగ్గా... నిరుపమ్ వెంటనే నేను అంతగా దాచుకుని చేసే పనులు లేవని చెప్పాడు

More from Filmibeat

Read more about: premi viswanath vantalakka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X