కార్తీక దీపం శౌర్య బర్త్ డే.. కరోనా నేపథ్యంలో సెట్‌లోనే అలా సెలెబ్రేట్ చేసిన వంటలక్క
రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బాబు, వంటలక్క, శౌర్య అనే క్యారెక్టర్లు తెలియని వారెవ్వరూ ఉండరు. మహిళా లోకాన్ని ఎంటర్టైన్ చేస్తోన్న కార్తీక దీపం సీరియల్‌లోని ఈ పాత్రలు ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి. వీరి ఒరిజినల్ పేర్ల కంటే పాత్రల ద్వారా వచ్చిన పేర్లే ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. ఇక బుల్లితెరపై చిచ్చర పిడుగుగా అందర్నీ ఓ ఆట ఆడించే శౌర్య అలియాస్ కృతిక.. సోషల్ మీడియానూ రఫ్పాడిస్తోంది. వయసు చిన్నదే అయినా చేసే పనులు మాత్రం చాలా గొప్పవి. పెద్దవి.

సోషల్ మీడియాలో యాక్టివ్..
కృతిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సెట్‌లో జరిగే విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. షూటింగ్ గ్యాప్‌లో సరదాగా గడిపిన సందర్భాల గురించి తెలుపుతుంది. లొకేషన్లలోని వర్కింగ్ స్టిల్స్, పర్సనల్ ఫోటోలను పంచుకుంటూ తెగ సందడి చేస్తుంది.

పెద్ద మనసు..
ఆ మధ్య కృతిక చేసిన ఓ మంచి పని అందర్నీ ఆకట్టుకుంది. ఓ అభిమాని తన భార్య బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పమని అడిగితే.. ఎవ్వరికైనా సాయం చేయండి అప్పుడు విష్ చేస్తానని చిన్నారి కృతిక ఓ కండీషన్ పెట్టింది. దానికి తలొంచి సదరు నెటిజన్ సాయం చేసిన ఫోటోలను కృతికకు షేర్ చేయగా.. బర్త్ డే విషెస్ చెబుతూ ఓ వీడియోను కానుకగా పంపింది.

కృతిక బర్త్ డే..
ఇక నిన్న (ఆగస్ట్ 6) కృతిక బర్త్ డే. ఈ సందర్భంగా చిన్నారికి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా విషెస్ వెల్లువెత్తాయి. అంతేకాకుండా కొందరు అభిమానులు కూడా బహుమతులను పంపారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

వెరైటీ కేక్ కటింగ్..
బేబీ కృతిక డిఫరెంట్‌గా ఆలోచించింది. అందరిలా కాకుండా వెరైటీ కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఓ యోధురాలిగా కేక్ కట్ చేయాలని ప్రయత్నిస్తున్నా.. కేక్ కట్ చేయడంలో కొత్త స్టైల్ ఇది.. మీ అందరి విషెస్, ఆశీర్వాదాలకి థ్యాంక్స్' అని తెలిపింది.
Recommended Video

క్యారవ్యాన్‌లో సెలెబ్రేషన్..
అయితే వంటలక్క మాత్రం షూటింగ్ సెట్‌లోనే బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిపినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఓ లడ్డును తినిపించింది. కరోనా కారణంగా హత్తుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లాంటివి చేయలేదు. తన కూతరు బర్త్ డే అందరూ ఆశీర్వదించండని వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్) కోరింది.


Click it and Unblock the Notifications











