For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Karthika Deepam’ యూనిట్‌కు బెదిరింపులు: అదే జరిగితే కాల్చేస్తాం అంటూ పోస్టులు.. బయటపెట్టిన హీరోయిన్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు రాజ్యం ఏలుతున్నాయి. తద్వారా టీఆర్పీల రికార్డులను బద్దలు కొడుతూ ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నాయి. అందులో కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా విజయాలను అందుకుంటాయి. అలాంటి వాటిలో 'కార్తీక దీపం' ఒకటి. చాలా కాలంగా ప్రసారం అవుతోన్న ఈ ధారావాహిక ఈ మధ్య మరింత ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి కారణం హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్సే. ఇలాంటి పరిస్థితుల్లో 'కార్తీక దీపం' యూనిట్‌కు బెదిరింపులు మొదలయ్యాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పెళ్లిపీటల మీదే రొమాన్స్.. వైరల్ అవుతున్న నవ దంపతుల ఫోటో షూట్..

  ‘కార్తీక దీపం' కాదు... ‘కరుతముత్తు'

  ‘కార్తీక దీపం' కాదు... ‘కరుతముత్తు'

  తెలుగులో రావడానికి ముందే ‘కార్తీక దీపం' సీరియల్ మలయాళంలో ప్రసారం అయింది. ‘కరుతముత్తు' అనే పేరుతో వచ్చిన ఈ ధారావాహిక సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఇక, ఇందులో నల్లగా ఉన్న అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు.. అనుమానంతో భార్యను వదిలేస్తాడు. చివరకు వీళ్లెలా కలిశారనేదే సీరియల్ నేపథ్యం.

  తెలుగింటి ఆడపడుచులా వంటలక్క

  తెలుగింటి ఆడపడుచులా వంటలక్క

  తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టార్లకు సమానంగానే సీరియల్ నటీనటులకు కూడా ఫాలోయింగ్ లభిస్తుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రతి ఇంట్లో సొంత మనిషిలా మారిపోయింది. దీంతో ఈ మలయాళీ హీరోయిన్‌ను తెలుగింటి ఆడపడుచుగా భావిస్తున్నారు.

  నేషనల్ రికార్డులు బద్దలు కొట్టేసింది

  నేషనల్ రికార్డులు బద్దలు కొట్టేసింది

  ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమైన ‘కార్తీక దీపం' సీరియల్‌కు ఆరంభం నుంచే మంచి ఆదరణ లభించింది. ఫలితంగా రేటింగ్ కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. దీంతో బుల్లితెరపై రికార్డులు బద్దలయ్యాయి. ఒకానొక దశలో ఇండియాలోనే నెంబర్ వన్ ఛానెల్‌గానూ వెలుగొందింది. ఇలా తెలుగు నుంచి వచ్చి నేషనల్ రికార్డును క్రియేట్ చేసిన ఏకైక సీరియల్ కార్తీక దీపమే.

  కనెక్ట్ అయ్యారు.. ఆ మార్క్ దాటింది

  కనెక్ట్ అయ్యారు.. ఆ మార్క్ దాటింది

  ఆరంభంలో కొన్ని రోజులు మాత్రమే సరదాగా సాగిన ‘కార్తీక దీపం' సీరియల్.. ఆ తర్వాత నుంచి రోజు రోజుకూ ఎమోషనల్‌గానే సాగుతోంది. అందుకే తెలుగు ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు. దీనికితోడు తరచూ ఇందులో ఏదో ఒక ట్విస్ట్ చూపిస్తుండడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతో ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్‌ను కూడా దాటేసింది.

  నిజం తెలిసింది.. మరింత ఆసక్తికరం

  నిజం తెలిసింది.. మరింత ఆసక్తికరం

  కొంత కాలంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోన్న ‘కార్తీక దీపం' సీరియల్ చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు వారాలుగా ఇది ఎమోషనల్‌గా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల డాక్టర్ బాబుకు దీప గురించి నిజం తెలిసింది. దీంతో ఆమెకు ఎంతో అన్యాయం చేశానని గుర్తు చేసుకున్న అతడు.. ఏడుస్తూ కింద పడిపోయాడు. దీంతో ఈ టాప్ సీరియల్ మరింతగా రక్తి కట్టింది.

  ‘కార్తీక దీపం' యూనిట్‌కు బెదిరింపు

  ‘కార్తీక దీపం' యూనిట్‌కు బెదిరింపు

  ‘కార్తీక దీపం' సీరియల్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు సైతం దీన్ని వీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని ఎంతో మంది సెలెబ్రిటీలు స్వయంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే ఇది టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఈ సీరియల్ యూనిట్‌కు కొందరు వార్నింగ్ ఇస్తున్నారని తెలిసింది.

  P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
  బయట పెట్టిన సీరియల్ హీరోయిన్

  బయట పెట్టిన సీరియల్ హీరోయిన్

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును షేర్ చేసింది. అందులో ఓ నెటిజన్.. ‘వంటలక్క చచ్చిపోతే రాష్ట్రాలు తగలబడిపోతాయి' అంటూ బెదిరించినట్లుగా పోస్ట్ పెట్టడం కనిపించింది. ఇక, ఇందులోనే ‘వంటలక్క జిందాబాద్' అని కూడా పెట్టాడు. ఈ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Recent Time This Serial Running with Many Twists. Now Premi Viswanath Fans Warning to Karthika Deepam Unit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X