For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vantalakka Re Entry: కార్తీక దీపంలో బిగ్ ట్విస్ట్.. వంటలక్క రీఎంట్రీ.. ఎప్పుడు వస్తుందంటే!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే చాలా తక్కువ సీరియళ్లు మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. అందులో 'కార్తీక దీపం' ఒకటి. ఇక, ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీప అలియాస్ వంటలక్కగా ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన యాక్టింగ్ అందరికీ గుర్తుండిపోతుంది. అలాంటిది కొద్ది రోజుల క్రితమే ఈమెతో పాటు హీరో నిరుపమ్ డాక్టర్ బాబు పాత్రను చనిపోయినట్లుగా చూపించారు. దీంతో ఈ సీరియల్ కాస్త డల్‌గా నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'కార్తీక దీపం' సీరియల్‌లోకి దీప అలియాస్ వంటలక్క రీఎంట్రీ ఇస్తోంది. అసలేం జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   ప్రేమీ విశ్వనాథ్‌కు తీసుకున్నారు

  ప్రేమీ విశ్వనాథ్‌కు తీసుకున్నారు

  మలయాళంలో బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే తన హవాను చూపించి స్టార్‌గా ఎదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సీరియళ్లలో నటించిన ఆమె.. 'కరుతముత్తు' అనే సీరియల్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించింది. ఇందులో ఆమె పోషించిన పాత్ర హైలైట్ అయింది. అదే తెలుగులోకి 'కార్తీక దీపం' అనే పేరుతో రీమేక్ అయింది.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  ఒకే ఒక్క పాత్రతో ఆడపడుచులా

  ఒకే ఒక్క పాత్రతో ఆడపడుచులా


  'కరుతముత్తు'లో ప్రేమీ విశ్వనాథ్‌ యాక్టింగ్ చూసిన తెలుగు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర 'కార్తీక దీపం' కోసం ఆమెను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీరియల్‌లో దీప అలియాస్ వంటలక్కగా ఆమె అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎలాంటి సీన్‌నైనా అలవోకగా చేస్తూ మెప్పించింది. దీంతో తెలుగింటి ఆడపడుచులా ఆదరణ అందుకుంది.

   పాత్రలు అంతం.. సీరియల్ డల్

  పాత్రలు అంతం.. సీరియల్ డల్


  కొద్ది రోజుల క్రితమే 'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను చంపేశారు. దీంతో వాళ్లిద్దరి పిల్లల మధ్యన గొడవను పెట్టి సీరియల్‌ను తర్వాతి తరం వాళ్లతో నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నటులు ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు లేకపోవడంతో ఈ సీరియల్ చాలా డల్‌గా నడుస్తుందని చెప్పవచ్చు.

  Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!

  కార్తీక దీపంలోకి మళ్లీ వంటలక్క

  కార్తీక దీపంలోకి మళ్లీ వంటలక్క


  సీరియల్‌కు ఆదరణ తగ్గుతుందని గ్రహించారో.. కథను మలుపు తిప్పాలనుకున్న కారణమో తెలియదు కానీ... 'కార్తీక దీపం' యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం చనిపోయినట్లు చూపించిన వంటలక్క అలియాస్ దీపను మరోసారి సీరియల్‌లోకి తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.

  ప్రోమో విడుదల.. అలా కనిపించి

  ప్రోమో విడుదల.. అలా కనిపించి


  'కార్తీక దీపం' సీరియల్‌లో జరిగిన కారు ప్రమాదంలో వంటలక్క చనిపోయినట్లు అప్పుడు చూపించారు. అయితే, ఆమె అప్పుడు చనిపోకుండా కోమాలోకి వెళ్లినట్లు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో దీప అప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చింది. అయితే, ఆమె ఎక్కడ చికిత్స తీసుకుంది అనేది చూపించలేదు. ఇక, ఆమె రీఎంట్రీతో కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  ప్రేమీ విశ్వనాథ్ ఎమోషనల్ నోట్


  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రేమీ విశ్వనాథ్ తాజాగా కార్తీక దీపంలోకి తన రీఎంట్రీని కన్ఫార్మ్ చేస్తూ ఓ నోట్ రాసింది. అందులో 'తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అందరి ఆశీస్సులతో కార్తీక దీపంలో దీపగా, వంటలక్కగా మీ మనసులో చోటు సంపాదించుకున్నా. కథకు అనుగుణంగా మీ దీప మీ ముందు లేకున్నా.. అందరి మనసుల్లో వెలిగాను' అని చెప్పింది.

  అఖండ జ్యోతిలా వెలగాలని అని

  అఖండ జ్యోతిలా వెలగాలని అని


  అంతేకాదు, 'మళ్లీ మీ ముందుకు మరింత వెలుగుతో మీ ప్రేమను పొందడానికి వస్తున్నాను. మీ స్టార్ మాలో రాత్రి 7.30 గంటలకు వస్తున్నాం. ఈసారి మరింత అలరిస్తూ, నవ్విస్తూ, అప్పుడప్పుడూ మీ కంట నీరులా మారుతూ మీ ప్రేమ పొందాలని వస్తున్నాం. ఈ దీపాన్ని అఖండ జ్యోతిలా వెలిగించాలని కోరుతూ.. మీ దీప' అని అందులో ప్రేమీ విశ్వనాథ్ కోరుకుంది.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Heroine Premi Viswanath Re Entry to This Serial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X