For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Karthika Deepam’ దర్శకుడు ఎవరో తెలుసా? రెండు సినిమాలు కూడా.. నిజస్వరూపం బయటపెట్టిన వంటలక్క

  |

  కార్తీక దీపం.. దాదాపు మూడున్నరేళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోన్న సీరియల్. ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ధారావాహిక.. అప్పటి నుంచి వేయి ఎపిసోడ్లకు పైగా ప్రసారం అవుతూనే ఉంది. మొదటి నుంచే ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీరియల్.. ఇటీవలి కాలంలో రంజుగా మారింది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకూ సత్తా చాటుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక దీపం హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్.. సీరియల్ డైరెక్టర్ నిజస్వరూపం బయట పెట్టేసింది. ఆ సంగతులు మీకోసం!

  ఎద అందాలతో కవ్విస్తోన్న లోఫర్ బ్యూటీ దిశా పటానీ

  దానికి రీమేక్‌గా వచ్చిందే ‘కార్తీక దీపం'

  దానికి రీమేక్‌గా వచ్చిందే ‘కార్తీక దీపం'

  తెలుగులో చాలా కాలంగా నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది ‘కార్తీక దీపం'. ఇది మలయాళంలో ‘కరుతముత్తు' అనే పేరుతో వచ్చిన సీరియల్‌కు రీమేక్‌గా ప్రసారం అవుతుంది. దీపను ప్రేమ వివాహం చేసుకుని.. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను డాక్టర్ బాబు అనుమానించడం.. అప్పటి నుంచి హీరోయిన్ ఎలాంటి కష్టాలను అనుభవించింది అనే కాన్సెప్టుతో ఈ సీరియల్ నడుస్తోంది.

   మాయ చేసిన దీప... భారీ స్పందనతో

  మాయ చేసిన దీప... భారీ స్పందనతో

  ‘కార్తీక దీపం'లో హీరోయిన్‌గా చేస్తోన్న దీప అలియాస్ వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఈమె కేరళకు చెందిన బుల్లితెర నటి. అక్కడ ఎన్నో సీరియళ్లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ‘కరుతముత్తు'లోనూ ఆమెనే హీరోయిన్. అందుకే తెలుగులోకి కూడా ఈ భామనే తీసుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేమీ విశ్వనాథ్ అదిరిపోయే యాక్టింగ్‌తో మాయ చేసేస్తుంది.

   టీఆర్పీపై దండయాత్ర.. రికార్డులు బ్రేక్

  టీఆర్పీపై దండయాత్ర.. రికార్డులు బ్రేక్

  ‘కార్తీక దీపం' సీరియల్ ఇప్పటికే మూడున్నరేళ్లుగా 1000కి పైగా ఎపిసోడ్లతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఆరంభం నుంచి ఏమాత్రం బోర్ అనిపించకుండా ఇది ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా ఇది నిలుస్తోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌ను కూడా ఘననీయంగా అందుకుంటూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందీ ధారావాహిక.

   డైరెక్టర్‌పై ప్రేక్షకుల అభిమానం... తిట్లు

  డైరెక్టర్‌పై ప్రేక్షకుల అభిమానం... తిట్లు

  ఒక సీరియల్‌కు డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది దాన్ని వెయికి పైగా ఎపిసోడ్లతో నడిపించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇలా చేయడం కోసం సీరియల్‌లో ఎన్నో ట్విస్టులు పెడుతున్నాడు కార్తీక దీపం దర్శకుడు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న ఆయన.. దీప ఫ్యాన్స్ నుంచి మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నారు.

   ‘కార్తీక దీపం' దర్శకుడు ఎవరో తెలుసా

  ‘కార్తీక దీపం' దర్శకుడు ఎవరో తెలుసా

  తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోన్న ‘కార్తీక దీపం'ను కాపుగంటి రాజేంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో ‘అందం' వంటి సక్సెస్‌ఫుల్ సీరియల్‌ను తీశారు. దాని తర్వాత కూడా పలు ధారావాహికలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘కార్తీక దీపం' సీరియల్‌ను చేస్తున్నారు. దీంతో ఆయన పేరు బుల్లితెరపై సెన్సేషన్ అవుతోంది.

   ‘కార్తీక దీపం' ముందే రెండు మూవీలు

  ‘కార్తీక దీపం' ముందే రెండు మూవీలు

  బుల్లితెరపై కొన్ని సీరియళ్లు చేసిన తర్వాత సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు కాపుగంటి రాజేంద్ర. ఈ క్రమంలోనే మోహన్ బాబు - సౌందర్య కలయికలో వచ్చిన ‘శివ శంకర్', అల్లరి నరేష్‌తో ‘రాంబాబు గాడి పెళ్లాం' అనే సినిమాలను తెరకెక్కించారు. అయితే, అవి రెండూ పరాజయం పాలయ్యాయి. దీంతో సినిమాలకు దూరం అయిపోయారాయన.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   నిజస్వరూపం బయటపెట్టిన వంటలక్క

  నిజస్వరూపం బయటపెట్టిన వంటలక్క

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్.. తరచూ షూటింగ్ స్పాట్‌లోని వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘కార్తీక దీపం' డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రతో దిగిన ఫొటోను షేర్ చేసింది. తద్వారా ఆయన ఎలా ఉంటారన్న దాన్ని అందరికీ చూపించింది. ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Heroine Premi Viswanath Share This Serial Director Kapuganti Rajendra Photo in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X